ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం

కరోనా పాజిటివ్‌ వచ్చిన గర్భిణికి ఆపరేషన్‌ చేసి తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడిన ఘనత నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు దక్కింది.

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం
Follow us

|

Updated on: Nov 05, 2020 | 7:49 AM

కరోనా పాజిటివ్‌ వచ్చిన గర్భిణికి ఆపరేషన్‌ చేసి తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడిన ఘనత నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు దక్కింది. యడపల్లి మండలం జైతాపూర్‌ గ్రామానికి చెందిన గర్భిణి గత నెల 21న అనారోగ్యంతో జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి టెస్టుల కోసం వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేశారు. ఉమ్మనీరు తగ్గినట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. కరోనా సోకి ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని శస్త్రచికిత్స చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది అరుదైన ఆపరేషన్‌గా చెప్పవచ్చు.

ఆ మహిళ – ఇద్దరు మగశిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు తక్కువ బరువు ఉన్నట్టు గుర్తించి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ అందించారు. శిశువులకు కరోనా పరీక్షలు చేయగా నెగటివ్‌గా తేలింది. ప్రస్తుతం తల్లికి కూడా నెగటివ్‌ రావడంతో అందర్నీ ఇంటికి పంపించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ ప్రతీమ్‌రాజ్‌ తెలిపారు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు