నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

వెలగపూడిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో  పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !
Follow us

|

Updated on: Nov 05, 2020 | 7:21 AM

వెలగపూడిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో  పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ సమావేశాల నిర్వహణ, ఆమోదించాల్సిన బిల్లులపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నవంబర్‌ 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ నిర్వహణ తేదీపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.  నూతన ఇసుక విధానంపై మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదనలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా కొత్త ఇసుక పాలసీని ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో సంభవించిన నష్టంపై రూపొందించిన అంచనాలు కేబినెట్‌ ముందుకు రానున్నాయి. దాదాపు 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని సర్కార్ అంచనా వేస్తోంది.

దిశ బిల్లులో సవరణ అంశాలు, అసైన్డ్‌ భూముల లీజుల బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఐపీసీ సెక్షన్లను మార్పు చేసే అంశంపై ఇటీవలే దిశ బిల్లును కేంద్రం తిప్పి పంపింన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై విధించిన సెస్, ప్రొఫెషనల్ టాక్స్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీలకు భూ కేటాయింపులపై చర్చించి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలని ప్రణాళిక సిద్దం చేసిన ప్రభుత్వం.. తదనుగుణంగా స్థలాలను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. రవాణా పన్నుల పెంపు ప్రతిపాదనలపైనా మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు.

Also Read : అగ్రరాజ్యంలో చేతులు మారబోతోన్న అధికారపీఠం.. విజయానికి చేరువలో జో బైడెన్