ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి

తూర్పు లడక్‌ ప్రాంతంలోని ష్యోక్‌ నదిపై ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసిందని సైనికాధికారులు శనివారం ప్రకటించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చైనా విఫలయత్నం చేసింది. ఈ బ్రిడ్జితో ఆర్మీ జవాన్లు మరింత గస్తీ కాసేందుకు వీలవుతుంది.

  • Balaraju Goud
  • Publish Date - 8:35 pm, Sat, 20 June 20
ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో  బ్రిడ్జి నిర్మాణం పూర్తి
Glimpse of closing ceremony of Ex Indra 2017, at Vladivostok, in Russia on October 29, 2017.

తూర్పు లడక్‌ ప్రాంతంలోని ష్యోక్‌ నదిపై ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసిందని సైనికాధికారులు శనివారం ప్రకటించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చైనా విఫలయత్నం చేసింది. ఎట్టకేలకు పూర్తైన బ్రిడ్జితో భారత జవాన్లు మరింత గస్తీ కాసేందుకు వీలవుతుంది.
ష్యోక్‌-గాల్వాన్‌ నదుల సంగమ కేంద్రం వద్ద వ్యూహాత్మకంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు అధికారులు.పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 ట్రాక్‌ పరిధిలోకి ఈ బ్రిడ్జి రాదని స్పష్టం చేశారు. 60 మీటర్ల పొడవున్న ఈ వంతెన పైనుంచి ఆర్మీ వాహనాలు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలవుందన్నారు. గాల్వాన్‌ నదిపై జవాన్లు కాలినడకన వెళ్లేందుకు మాత్రమే వంతెన ఉండేదని.. బ్రిడ్జి నిర్మాణంతో భారత బలగాల పహారా మరింత పెరిగే అవకాశముందని ఆర్మీ అధికారులు పేర్కోన్నారు. సరిహద్దులో అభివృద్ధి జరుగుతుండడంతో జీర్ణించుకోలేని చైనా.. గాల్వాన్‌ లోయలో ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పిస్తుంది.