సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన ఇండియా

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన ఇండియా

ఢిల్లీ-అట్టారీ-లాహోర్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను భారత్‌ రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర భారతీయ రైల్వే ఆదివారం ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దుచేయడంతో ప్రతిచర్యగా పాకిస్థాన్‌ తన భూభాగంలో ప్రయాణించే లాహోర్‌-అట్టారీ (14607, 14608) రైలును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీ-అట్టారీ (14001, 14002) సర్వీసును భారత్‌ రద్దు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రద్దు చేసిన రైలు సేవలను కొనసాగించాలని పాక్‌ రైల్వే […]

Ram Naramaneni

|

Aug 12, 2019 | 12:23 AM

ఢిల్లీ-అట్టారీ-లాహోర్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను భారత్‌ రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర భారతీయ రైల్వే ఆదివారం ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దుచేయడంతో ప్రతిచర్యగా పాకిస్థాన్‌ తన భూభాగంలో ప్రయాణించే లాహోర్‌-అట్టారీ (14607, 14608) రైలును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీ-అట్టారీ (14001, 14002) సర్వీసును భారత్‌ రద్దు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రద్దు చేసిన రైలు సేవలను కొనసాగించాలని పాక్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌కు భారత్‌ విజ్ఞప్తి చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఈ రైలును భారత్‌ కూడా  రద్దు చేసింది. 1972లో సిమ్లా ఒప్పందం జరిగాక 1976 నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢిల్లీ-అట్టారీ-లాహోర్‌ మధ్య వారానికి రెండు రోజులు నడుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu