కశ్మీర్‌లో కొత్తగా 300 టెలిఫోన్‌ బూత్‌లు!

కశ్మీర్‌లో 300 టెలిఫోన్‌ బూత్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు తమ బంధువులతో మాట్లాడుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం ఆదివారం తెలిపింది. చదువుల రీత్యా ఎక్కువ మంది పిల్లలు జమ్ము కశ్మీర్‌ వెలుపల నివసిస్తుండడం వల్ల సమాచార వ్యవస్థ స్తంభింపచేసిన నాటి నుంచి వారికి కుటుంబాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ సత్యపాల్‌ మలిక్‌ తెలిపారు. బక్రీద్‌ సందర్భంగా ఇళ్లకు వెళ్లలేని విద్యార్థులు పండుగ జరుపుకోవడం కోసం […]

కశ్మీర్‌లో కొత్తగా 300 టెలిఫోన్‌ బూత్‌లు!
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2019 | 9:41 PM

కశ్మీర్‌లో 300 టెలిఫోన్‌ బూత్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు తమ బంధువులతో మాట్లాడుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం ఆదివారం తెలిపింది. చదువుల రీత్యా ఎక్కువ మంది పిల్లలు జమ్ము కశ్మీర్‌ వెలుపల నివసిస్తుండడం వల్ల సమాచార వ్యవస్థ స్తంభింపచేసిన నాటి నుంచి వారికి కుటుంబాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ సత్యపాల్‌ మలిక్‌ తెలిపారు. బక్రీద్‌ సందర్భంగా ఇళ్లకు వెళ్లలేని విద్యార్థులు పండుగ జరుపుకోవడం కోసం కొన్ని నిధులు కేటాయించినట్లు రాజ్‌ భవన్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతా బలగాలు మోహరించిన నాటి నుంచి అధికారులు సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిపివేశారు. ఇంటర్నెట్‌, వాయిస్‌ కాల్స్‌ సర్వీసులు పని చేయడం లేదు. దీంతో ప్రజలు తమ ఆప్తులతో మాట్లాడుకొనేందుకు కూడా వీలు లేకుండా పోయింది. పాలన సాగించేందుకు అధికారులు మాత్రం ఉపగ్రహ ఆధారిత మొబైల్స్‌ను వాడుతున్న సంగతి తెలిసిందే.