‘బిగ్‌బాస్’ నుంచి తమన్నా సింహాద్రీ ఔట్!
బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ లో ఎట్టకేలకు అందరూ ఊహించనట్లుగానే మూడో ఎలిమినేషన్ గా తమన్నా సింహాద్రీ ఎలిమినేట్ అయ్యింది. తొలివారం హేమ ఎలిమినేట్ కావడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. మొదటివారం కారణంగా తమన్నా నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు లభించింది. అయితే ఆ తర్వాతి వారమే ఇంటి సభ్యులు తమన్నాను నామినేట్ చేశారు. ఇక ప్రేక్షకుల నుంచి కూడా తమన్నాకు ఓట్లు తక్కువగా రావడంతో బిగ్‌బాస్ షో […]
బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ లో ఎట్టకేలకు అందరూ ఊహించనట్లుగానే మూడో ఎలిమినేషన్ గా తమన్నా సింహాద్రీ ఎలిమినేట్ అయ్యింది. తొలివారం హేమ ఎలిమినేట్ కావడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. మొదటివారం కారణంగా తమన్నా నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు లభించింది. అయితే ఆ తర్వాతి వారమే ఇంటి సభ్యులు తమన్నాను నామినేట్ చేశారు. ఇక ప్రేక్షకుల నుంచి కూడా తమన్నాకు ఓట్లు తక్కువగా రావడంతో బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఆదివారం హోస్ట్ నాగార్జున బ్లూ బ్లాక్ కాంబినేషన్ తో హ్యాండ్ సమ్ లుక్ తో ఎంట్రీ ఇవ్వడంతో నే సండే సందడి మొదలైంది. సండే ఫన్‌డే అంటూ హౌస్‌మేట్స్‌కు కొత్త గేమ్స్ ఇచ్చి ప్రేక్షకులకు వినోదం పంచారు. ఈ సారి షోకు గెస్ట్‌గా వెన్నెల కిషోర్ రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే సాంగ్స్ సందర్భంగా హౌస్ మేట్స్ అంతా సరదాగా గడిపారు.