పొంగిపొర్లుతున్న మూసీ…
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు... మూసీ పరివాహ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. హైదరాబాద్ నగరంతోపాటు...
![పొంగిపొర్లుతున్న మూసీ...](https://images.tv9telugu.com/wp-content/uploads/2020/08/musi-flood-1.jpg?w=1280)
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు… మూసీ పరివాహ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల జిల్లాలో కురుసిన నీరు మూసీలోకి వెళ్తుంది. దీంతో మూసీ నది పొంగి పొర్లుతోంది. మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 6500 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 245 క్యూసెక్కులు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నీటి మట్టం 640.7 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని వికారాబాద్ జిల్లాలోకు హెచ్చరికను జారీ చేశారు అధికారులు.