దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా..

విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో.. శుక్రవారం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. అయితే.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం..

దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 17, 2020 | 1:03 PM

Durgagudi Flyover : విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో.. శుక్రవారం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. అయితే.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం.. రేపట్నుంచే వాహనాలను ఫ్లైఓవర్‌పై అనుమతించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.

ఈ నెల 8న ముందుగా ఫ్లైఓవర్‌ను ప్రారంభాలనుకున్నారు. అయితే.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతితో వాయిదా వేయాల్సి వచ్చింది. రేపు ప్రారంభించడానికి మరో ముహూర్తం ఖరారు చేసినా.. నితిన్‌ గడ్కరీకి కరోనా సోకడంతో.. మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.