అక్కడ భక్తులకు ప్రసాదంగా.. చికెన్, మటన్ బిర్యానీ..!
తమిళనాడు మదురై జిల్లా తిరుమంగళం తాలూకాలోని ఒక చిన్న గ్రామం వడక్కంపట్టి. ఈ గ్రామంలోని మునియాండి స్వామి ఆలయంలో ప్రసాదంగా చికెన్, మటన్ బిర్యానీని పంపిణీ చేస్తారు. గత 83 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వార్షిక ఉత్సవాల్లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు బిర్యానీని పంచుతారు. “2 వేల కిలోల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లతో బిర్యానీని 50 కట్టెల పొయ్యిలలో వండుతారు.. […]
తమిళనాడు మదురై జిల్లా తిరుమంగళం తాలూకాలోని ఒక చిన్న గ్రామం వడక్కంపట్టి. ఈ గ్రామంలోని మునియాండి స్వామి ఆలయంలో ప్రసాదంగా చికెన్, మటన్ బిర్యానీని పంపిణీ చేస్తారు. గత 83 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వార్షిక ఉత్సవాల్లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు బిర్యానీని పంచుతారు. “2 వేల కిలోల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లతో బిర్యానీని 50 కట్టెల పొయ్యిలలో వండుతారు.. తెల్లవారుజామున 4 గంటలకు దేవతకు అర్పిస్తారు, తరువాత ఉదయం 5 గంటలకు వడ్డిస్తారు” అని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు ఎన్ మునిస్వరన్ చెప్పారు. అల్పాహారం కోసం బిర్యానీ తినడం ఈ ఉత్సవం ప్రత్యేక లక్షణం.. ఇది ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ అందించబడుతుంది. వడక్కంపట్టిలో దాదాపు అందరూ బిర్యానీ అభిమానులే.. ప్రసిద్ధ మదురై శ్రీ మునియాండి విలాస్ రెస్టారెంట్ ఇక్కడ ఉంది.