మంగుళూరు ఎయిర్‌పోర్ట్ బాంబు కేసులో నయా ట్విస్ట్..

మంగుళూరు విమానాశ్రయంలో బాంబు కేసు మలుపులు తిరుగుతోంది. నిందితుడు ఆదిత్యరావును కష్టడీలోకి తీసుకున్న పోలీసులకు షాక్‌లు తగులుతున్నాయి. అతడి బ్యాంకు లాకర్లో లభ్యమైన అనుమానస్పద రసాయనం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సదరు పొడి ఏంటన్నది నిర్దారణ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అది ప్రాణాలను హరించే  సైనైడ్ మిశ్రమం అయి ఉండవచ్చని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. కాగా నిందితుడు సూసైడ్ టెండన్సీలో ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకే అతడు ఆ పొడిని బ్యాంక్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:37 pm, Sun, 26 January 20
మంగుళూరు ఎయిర్‌పోర్ట్ బాంబు కేసులో నయా ట్విస్ట్..

మంగుళూరు విమానాశ్రయంలో బాంబు కేసు మలుపులు తిరుగుతోంది. నిందితుడు ఆదిత్యరావును కష్టడీలోకి తీసుకున్న పోలీసులకు షాక్‌లు తగులుతున్నాయి. అతడి బ్యాంకు లాకర్లో లభ్యమైన అనుమానస్పద రసాయనం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సదరు పొడి ఏంటన్నది నిర్దారణ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అది ప్రాణాలను హరించే  సైనైడ్ మిశ్రమం అయి ఉండవచ్చని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. కాగా నిందితుడు సూసైడ్ టెండన్సీలో ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకే అతడు ఆ పొడిని బ్యాంక్ లాకర్‌లో దాచి ఉండొచ్చేమో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు ఇల్లు, ఆఫీసులతో పాటు అతడు సంచరించిన ప్రాంతాల్లో కూడా దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

అసలు ఏం జరిగిందంటే:

 మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ కౌంటర్ వద్ద ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. బాంబు స్వ్కాడ్.. అందులో డేంజరస్ ప్రమాదకర ఐఈడీని గుర్తించింది. వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించి.. బాంబును సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. అనుమానితుడి ఫోటోలు రిలీజ్ చేసిన పోలీసులు..దర్యాప్తు ముమ్మరం చేశారు. కానీ అనూహ్యంగా గత బుధవారం అతడే వచ్చి లొంగిపోయాడు. విచారణలో భాగంగా నిందితుడి బ్యాంక్ లాకర్‌లో అనుమానాస్పద పొడి విషయం బయలకు వచ్చింది.