AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణం మిస్టరీగా మారితే… కారణం లేకుండానే మృత్యువు కబలిస్తే… రెప్ప మూసేలోపే చీకట్లు అలుముకుంటే…

కన్ను తెరిస్తే జననం... కన్ను మూస్తే మరణం... రెప్పపాటు కాలమే ఈ జీవితం అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. పుట్టుక, చావు అనేవి దైవాధీనాలే అంటారు. మానవ తప్పిదాలతో మరణాన్ని కొందరు కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు ఇతరుల తప్పుల కారణంగా తనువులు చాలిస్తుంటారు.

మరణం మిస్టరీగా మారితే... కారణం లేకుండానే మృత్యువు కబలిస్తే... రెప్ప మూసేలోపే చీకట్లు అలుముకుంటే...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 08, 2020 | 11:35 PM

Share

కన్ను తెరిస్తే జననం… కన్ను మూస్తే మరణం… రెప్పపాటు కాలమే ఈ జీవితం అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. పుట్టుక, చావు అనేవి దైవాధీనాలే అంటారు. మానవ తప్పిదాలతో మరణాన్ని కొందరు కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు ఇతరుల తప్పుల కారణంగా తనువులు చాలిస్తుంటారు. అయితే ఎందుకు చనిపోతున్నామో… ఏ కారణంగా చావు కోరల్లోకి జారిపోతున్నామో… అసలెందుకు మృత్యువు కబలిస్తుందో తెలియక జీవరాశులు మరణించిన దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి అవేంటో చూద్దామా..

ఏలూరు ఘటనతో….

ఇటీవల ఏలూరులో అంతుచిక్కని సమస్య కారణంగా 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఒక్కరు చనిపోయారు. అయితే ఏలూరులోనే కాదు…ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల వింత రోగాలు వచ్చి జనాలు పిట్టల్లా రాలిపోయిన ఘటనలున్నాయి. వాటి చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం…

జపాన్ రోడ్లపై పడి…

జపాన్ లోని ఒకినవా నగరంలో ఆగస్టు17, 2020లో ఒక వింత ఘటన జరిగింది. సాధారణంగా మద్యం ఎక్కువ అయిన వాళ్లు స్పృహ కోల్పోతారు. అయితే మందు కొట్టిన వాళ్లే కాదు, తాగని వాళ్లు అలానే రోడ్ల పై ఎక్కడపడితే అక్కడ పడి నిద్రపోయారు. మహిళలు కూడా ఇలానే రోడ్లపై పడి నిద్రపోయారు. ప్రభుత్వం ప్రజలపై భారీ ఫైన్లను విధించినా, మార్పు రాలేదు. రోడ్డుపై పడుకున్న వ్యక్తులు ఇంట్లో నిద్రపోతున్నామనే ఫీలింగ్ తో ఒంటిపై బట్టలు విప్పేయడం కూడా జరిగింది. అయితే, ఎంత ప్రయత్నించినా ఈ వ్యాధి వివరాలు తెలుసుకోలేకపోయారు నిపుణులు.

మన్యంలో మాయరోగం…

విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ కరకవలసలో 2020 సెప్టెంబర్ 18న మాయ రోగం దాపురించింది. రోజుల వ్యవధిలోనే జ్వరం, కడుపునొప్పి, కాళ్ళు చేతులు విపరీతంగా వాచి ఐదుగురు మృత్యువాతపడ్డారు. అయితే అధికారులు నిల్వ ఉంచిన మాంసం తినడం వల్లే వారు చనిపోయారని అధికారులు అన్నారు. కానీ, అసలు కారణం బయటపడలేదు.

ఒడిస్సాను వణికించిన వ్యాధి…

ఒడిస్సా రాష్ర్టం నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితిలోని బొడొ అటిగాం గ్రామంలో అంతు చిక్కని వ్యాధి ప్రబలింది. దీంతో ఒక్కసారిగా రోజుల వ్యవధిలోనే 18మంది చనిపోయారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై చనిపోయారు. అయితే వారి మరణాలకు కారణం ఏంటో మాత్రం వైద్యాధికారులు గుర్తించలేకపోయారు. ఈ ఘటన సెప్టెంబర్ 19, 2020లోనే జరిగింది.

పశుపక్ష్యాదులకు సైతం….

ఏప్రిల్ 8, 2020న పెద్దపల్లి జిల్లా ఓదెల‌ గ్రామంలో 12 కుక్కలు హఠాత్తుగా చనిపోయాయి. వికారాబాద్‌లో సెప్టెంబర్ 19న300 పశువులు మృత్యువాతపడ్డాయి. చర్మంపై రంధ్రాలు పడి చనిపోయినట్లు వైద్యాధికారులు గుర్తించారు. అయితే కారణం మాత్రం ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ పుత్తూరు మండలం తడుకు పంచాయతీలో పాడి పశువులు 40 వరకు అంతుచిక్కని వ్యాధుల కారణంగా చనిపోయాయి. కరోనా కాలంలో తమిళనాడులోని పనపాక్కంలో రోడ్డుపై పడి 50 కాకులు చనిపోయాయి. మరణాలకు కారణం మాత్రం మిస్టరీగానే ఉంటున్నాయి.

వింత రోగాల వివరాలు…

ప్రపంచ వ్యాప్తంగా 6 నుంచి 8వేల వరకు వింతరోగాలు ఉన్నాయని ఓ మెడికల్ జర్నల్ తన రిపోర్టులో పేర్కొంది. అంతేకాకుండా 80 శాతం మంది తరుచుగా 350 రోగాలకు గురవుతున్నట్లు వెల్లడించింది. కాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు గురవుతున్న వారి శాతం 6 నుంచి 8 శాతం మందని పేర్కొంది. భారతదేశంలో 450 వింత రోగాలున్నట్లు తెలిపింది.

Follow Us
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
వేడి అన్నంలోకి అదిరిపోయే ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
వేడి అన్నంలోకి అదిరిపోయే ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..
తగ్గిన టమాట ధరలు.. సామాన్యులకు శుభవార్త
తగ్గిన టమాట ధరలు.. సామాన్యులకు శుభవార్త