‘స్విచ్‌హిట్’ షాట్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన టీమ్ ఇండియా మాజీ సారథి.. ఈ షాట్ ఆడాలంటే..

'స్విచ్‌హిట్' షాట్ గురించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

'స్విచ్‌హిట్' షాట్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన టీమ్ ఇండియా మాజీ సారథి.. ఈ షాట్ ఆడాలంటే..
Follow us

|

Updated on: Dec 08, 2020 | 11:24 PM

‘స్విచ్‌హిట్’ షాట్ గురించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇటీవల ఈ షాట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ షాట్‌పై క్రికెటర్స్ ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇస్తున్న ఇంటర్వూలో గంగూలీ ఈ షాట్‌పై మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దశాబ్ధ కాలంగా క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని, టీ 20 వల్ల క్రికెట్ అందనంత ఎత్తుకు వెళ్లిపోయిందని అన్నారు. గతంలో క్రికెట్‌లో సాధారణ షాట్లు మాత్రమే ఆడేవారని కానీ ప్రస్తుత క్రికెటర్లు రకరకాల షాట్లు ఆడుతున్నారని అందులో భాగమే ఈ ‘స్విచ్‌హిట్’ షాట్ అని వ్యాఖ్యానించారు. ‘స్విచ్‌హిట్’ లాంటి షాట్ ఆడాలంటే పుట్‌వర్క్ టైమింగ్‌తో పాటు చాలా విషయాలు కలిసిరావాలన్నారు. ఇప్పటి క్రికెటర్లను ఈ షాట్ ఆడకుండా ఆపలేమని తెలిపారు. మొదట ఈ షాట్‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్ ఆడారని, తర్వాత దీనిని డేవిడ్ వార్నర్ కొనసాగించారని పేర్కొన్నారు. ఈ షాట్‌ని సరిగా ఆడితే బాగుంటుందని, ఫెయిల్ అయితే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సిందే అన్నారు. బ్యాట్స్‌మెన్ తన స్టైల్‌లో బ్యాటింగ్ చేయకుండా బౌలర్ బంతి వేసేముందు దిశను మార్చుకొని ఆడటమే ఈ షాట్ ప్రత్యేకత. దీనివల్ల బౌలర్లు అయోమయానికి గురవుతారని అన్నారు. అంతేకాకుండా ఇటువంటి షాట్లతో ఫీల్డింగ్ చేసే కెప్టెన్‌కు ఆటగాళ్లను ఎక్కడ పెట్టాలో తెలియదని దీంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంటుందని వివరించారు.