AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల నిరసనలో కొత్త మలుపు, దళితులతో చేతులు కలుపుతున్న అన్నదాతలు, హర్యానాలో భారీ ర్యాలీ.

వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులు తమ ప్రొటెస్ట్ ను దేశవ్యాప్తం చేయదలిచారు. ఇందులో భాగంగా కుల మతాలను పక్కన పెట్టి ముఖ్యంగా దళితులను తమతో..

రైతుల నిరసనలో కొత్త మలుపు, దళితులతో చేతులు కలుపుతున్న అన్నదాతలు, హర్యానాలో భారీ ర్యాలీ.
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 21, 2021 | 12:39 PM

Share

వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులు తమ ప్రొటెస్ట్ ను దేశవ్యాప్తం చేయదలిచారు. ఇందులో భాగంగా కుల మతాలను పక్కన పెట్టి ముఖ్యంగా దళితులను తమతో కలిసి రావాలని వారు కోరుతున్నారు. హర్యానాలోని హిస్సార్ లో శనివారం జరిగిన మహాపంచాయత్ లో పెద్ద సంఖ్యలో దళితులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతునేత గుర్నామ్ చాధుని.. అన్నాదాతలకు, దళితులకు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని, దీన్ని ఇక దేశవ్యాప్తం చేస్తామని ఆయన చెప్పారు. తమ పోరాటం కేవలం ప్రభుత్వంపైనే కాదని, పెట్టుబడిదారులపై కూడా నని ఆయన చెప్పారు. ప్రతి దళితుడు తన ఇంట్లో బాబా సాహెబ్ అంబెడ్కర్ ఫోటోలను పెట్టుకోవాలని ఆయన కోరారు.  ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు తప్ప మరెవరికైనా ఓటు వేయాలని ఆయన సూచించారు.

ఈ ప్రభుత్వం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని గుర్నామ్ ఆరోపించారు. ఇన్ని దఫాలుగా చర్చలు జరిగినా కేంద్రం ఏదో ఒక సాకు చెప్పి మా ఆందోళనను పక్కదారి పట్టించే యత్నం చేస్తోందన్నారు. కాగా.. రైతు నేత రాకేష్ సింగ్ తికాయత్ త్వరలో పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించి మరింతమంది రైతులను సమీకరించేందుకు మహా పంచాయత్ లను నిర్వహించనున్నారు.

Also Read:

Shocking Animal Cruelty : పండు తిన్నదని ఆవును కత్తితో పొడిచి చంపిన వ్యాపారి.. కోపంలో ఆ పనిచేశానంటూ పశ్చాతాపం

తమిళనాట జోరుగా జల్లికట్టు పోటీలు, రక్తమోడుతున్నా వెనక్కి తగ్గని వైనం, చెట్టిపాలయంలో ప్రారంభించిన మంత్రి వేలుమణి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్