రెడ్ జోన్ నుంచి రావడంతో.. గుర్రానికీ తప్పని క్వారంటైన్..
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు అధికారులు. వారిని స్క్రీనింగ్ చేసి క్వారంటైన్‌కు పంపుతున్నారు. పరిస్థితినిబట్టి 7 రోజులు అడ్మినిస్ట్రేషన్‌లో ఉంచి.. ఆ తర్వాత హోంక్వారంటైన్‌కు పంపుతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లో ఓ గుర్రాన్ని సైతం క్వారంటైన్‌కు పంపించారు అధికారులు.
వివరాల్లోకెళితే.. కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లా నుంచి రాజౌరి జిల్లాకు ఓ వ్యక్తి గుర్రంపై వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ క్వారంటైన్‌కు పంపించారు. అంతేకాదు అతడు తీసుకొచ్చిన గుర్రాన్ని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచారు. షోపియన్ జిల్లా రెడ్‌జోన్‌లో ఉందని.. యజమానికి కరోనా పరీక్షలు చేశామని..రిపోర్టులు వచ్చే వరకైనా గుర్రం హోంక్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేశారు.
మరోవైపు.. జమ్మూ అండ్ కాశ్మీర్ వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు అక్కడ 1,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 833 మంది కోలుకోగా.. 24 మంది మరణించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 902 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
[svt-event date=”27/05/2020,4:25PM” class=”svt-cd-green” ]
J&K: A horse which returned to Rajouri from Shopian, along with its owner, is under home quarantine; the owner is in administrative quarantine. Tehsildar says “It is a red zone so we had to quarantine the man. The horse is under home quarantine at least till owner’s result comes” pic.twitter.com/Ph8FqrORCS
— ANI (@ANI) May 27, 2020
[/svt-event]