AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ రాజధానిలో మొద‌టి హిందూ ఆలయం..

భార‌త ప్ర‌జ‌ల‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయం ఏర్పాటు రంగం సిద్ద‌మైంది.

పాక్ రాజధానిలో మొద‌టి హిందూ ఆలయం..
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2020 | 11:01 PM

Share

భార‌త ప్ర‌జ‌ల‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయం ఏర్పాటు రంగం సిద్ద‌మైంది. భారీ ఖ‌ర్చుతో మువ్వ‌ల గోపాలుడు శ్రీకృష్ణుడి ఆలయ ఏర్పాటుకు అక్క‌డి ప్ర‌జలు ముంద‌డుగు వేశారు. జూన్ 23 ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన‌ పనులను లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఆలయ నిర్మాణం కోసం దాయాది పాకిస్థాన్ గ‌వ‌ర్న‌మెంట్ రూ.10 కోట్లు కేటాయించింది. 20,000 చదరపు అడుగుల్లో శ్రీకృష్ణ ఆల‌యం నిర్మితం కానుంది. ఈ ఆలయానికి ద‌గ్గ‌ర్లోనే హిందువుల కోసం స్పెష‌ల్ శ్మశాన వాటికను నిర్మించనున్నారు.

హ్యూమ‌న్ రైట్స్ పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి ఈ ఆలయ పనులను స్టార్ట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా విష‌యాలు వెల్లడించారు. ఇస్లామాబాద్‌, దాని పరిసర ప్రాంతాల్లో 1947కి పూర్వం చాలా హిందూ టెంపుల్స్ ఉండేవని లాల్ చంద్ మల్హి పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం అవేవీ లేవని..గత 20 సంవ‌త్స‌రాలుగా రాజధానిలో హిందువుల జనాభా అధికంగా పెరిగిందని ఆయన వివ‌రించారు. వారంతా ప్రేయ‌ర్స్ కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలోనే ఆలయాలయాలను నిర్మించడానికి సన్నాహాలు చేసిన‌ట్టు లాల్ చంద్ మల్హి పేర్కొన్నారు.ఈ దేవస్థానానికి ఇస్లామాబాద్‌లోని హిందూ పంచాయతీ ‘శ్రీకృష్ణ మందిర్‌’ అని పేరు పెట్టింది‌.

Follow Us
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..