ఇల్లీ బేబీ లవ్ చాప్టర్ క్లోజ్.. గుట్టు విప్పిన ఇన్‌స్టాగ్రామ్!

ఇల్లీ బేబీ లవ్ చాప్టర్ క్లోజ్.. గుట్టు విప్పిన ఇన్‌స్టాగ్రామ్!

సీనియర్ హీరోయిన్ ఇలియానా.. ఆండ్రూ క్నీబోన్‌ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి అందరికి తెలిసిందే. మీడియా ముందు పెదవి విప్పని ఇల్లీ బేబీ.. తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రేమ జంట విడిపోయారనే వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాన్ని నిజం చేస్తూ ఒకరి ఇన్‌స్టాగ్రామ్ మరొకరు అన్ ఫాలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఆండ్రూకు సంబంధించిన […]

Ravi Kiran

|

Aug 26, 2019 | 1:35 PM

సీనియర్ హీరోయిన్ ఇలియానా.. ఆండ్రూ క్నీబోన్‌ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి అందరికి తెలిసిందే. మీడియా ముందు పెదవి విప్పని ఇల్లీ బేబీ.. తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రేమ జంట విడిపోయారనే వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాన్ని నిజం చేస్తూ ఒకరి ఇన్‌స్టాగ్రామ్ మరొకరు అన్ ఫాలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఆండ్రూకు సంబంధించిన ఫోటోలను కూడా ఇలియానా డిలీట్ చేసింది.

ఆండ్రూతో ఇలియానా చాలా సంవత్సరాలుగా డేటింగ్ చేస్తోంది. ఒకానొక సందర్భంలో ఆండ్రూను ‘హబ్బీ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసింది. అయితే ఇద్దరూ మాత్రం పెళ్లి చేసుకున్నారా లేదా అనేది ఫ్యాన్స్‌ అందరిలోనూ సమాధానం లేని ప్రశ్న. అయితే తాజాగా వీళ్లిద్దరి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను పరిశీలిస్తే.. పాత జ్ఞాపకాలను ఇద్దరూ డిలీట్ చేసేశారు. మరోవైపు ఆండ్రూను తన 31వ పుట్టినరోజు నాడు విష్ చేసిన పోస్ట్‌ను కూడా ఇలియానా డిలీట్ చేయడం గమనార్హం. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై ఇలియానా మాత్రం అధికారికంగా స్పందించలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu