‘మేకిన్ ఇండియా’లో మరో ముందడుగు.. అరచేతిలోనే ‘డిజిటల్ క్యాలెండర్’.. ఆవిష్కరించిన కేంద్రమంత్రి..
Government of India: భారత ప్రభుత్వ డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ యాప్‌ను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు...
Government of India: భారత ప్రభుత్వ ‘డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ’ యాప్‌ను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఈ డిజిటల్ క్యాలెండర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యూజర్లకు ‘GOI Calendar” పేరుతో అందుబాటులో ఉంటుంది. జనవరి 15వ తేదీ నుంచి 11 భాషల్లో ఈ యాప్ ఉచితంగా లభిస్తుంది” అని పేర్కొన్నారు.
”ఇందులో ప్రతీ నెలాకు ఒక థీమ్‌తో కూడిన సందేశం పొందుపరిచి ఉంటుంది. అంతేకాకుండా ప్రసిద్ది చెందిన ఓ ఫేమస్ పర్సనాలిటీ చిత్రం కూడా ప్రచురితమై ఉంటుంది. ఈ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రతీ కార్యక్రమం ప్రజలకు తెలుస్తుందని కేంద్రమంత్రి అన్నారు. ప్రధాని మోదీ ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ఈ క్యాలెండర్ అండ్ డైరీ యాప్‌ను రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. కాగా, ఈ యాప్‌ను బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యునికేషన్ రూపొందించి.. అభివృద్ధి చేయగా.. ఇందులో కేంద్ర పధకాలు, కార్యక్రమాలు, అధికారిక సెలవులు మొదలగు పూర్తి సమాచారం లభిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు.
Launch of Digital Calendar & Diary App of Government of India https://t.co/OTUowe2cje
— Prakash Javadekar (@PrakashJavdekar) January 8, 2021