Mumbai Attack Mastermind: ముంబై లో మరణహోమ సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్ష తీర్పు వెలువరించిన పాకిస్తాన్ కోర్టు
ముంబై లో దారుణాన్ని తెరబడి మరణహోమాన్ని సృష్టించడానికి కరమైన సూత్రధారి ఎట్టకేలకు శిక్షపడింది. ముంబయి పేలుళ్ల జరపడానికి...
Mumbai Attack Mastermind: ముంబై లో దారుణాన్ని తెరబడి మరణహోమాన్ని సృష్టించడానికి కరమైన సూత్రధారి ఎట్టకేలకు శిక్షపడింది. ముంబయి పేలుళ్ల జరపడానికి ఉగ్రవాదులకు నిధులు అందించారనే కేసులో పాకిస్థాన్ కోర్టు శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. లష్కరే కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి టెర్రరిజం యాంటీ యాక్ట్ కింద 15 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియోగాలతో లఖ్వీని పాక్ ఉగ్రవాద నిరోధక శాఖ (సీడీటీ) గత శనివారం అరెస్టు చేయగా.. తాజాగా తీర్పు వెలువడింది. ముంబయి పేలుళ్ల కేసులో 2015 లో అరెస్టయిన లఖ్వీ అప్పటి నుంచి బెయిల్ పైనే ఉన్నాడు. అయితే, మళ్ళీ టెర్రరిస్టులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన (సీడీటీ) అతడిని అరెస్టు చేసింది. దాదాపు 12 ఏళ్ళు గడుస్తున్నా ఆ మరణం హోమం ఇంకా భారతీయుల మనసులను కలచివేస్తూనే ఉంది. 2008లో ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన పేలుళ్ల ఘటనలో 166 మంది ప్రాణాలు మరణించగా అనేకమంది క్షతగాత్రులయ్యారు.
Also Read: పెళ్లి తర్వాత వెబ్ సిరీస్‌లో నటిస్తున్న మెగా డాటర్ నిహారిక.. స్పెషల్ క్యారెక్టర్‌లో రంగమ్మత్తట