Niharika New Web Series: పెళ్లి తర్వాత వెబ్ సిరీస్‌లో నటిస్తున్న మెగా డాటర్ నిహారిక.. స్పెషల్ క్యారెక్టర్‌లో రంగమ్మత్తట
టాలీవుడు లో మెగా హీరోలు దాదాపు క్రికెట్ జట్టు. అయితే సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది మాత్రం మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక. పెళ్లి తర్వాత మెగాడటర్ నటిస్తుందా లేదా అన్న సందేహాలకు చెక్ పెడుతూ..

Niharika New Web Series: టాలీవుడు లో మెగా హీరోలు దాదాపు క్రికెట్ జట్టు. అయితే సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది మాత్రం మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక. మెగా డాటర్ నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో గత డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం పుణ్యక్షేత్రాల్లో పర్యటన, హనీమూన్ అంటూ సరదాగా గడిపిన ఈ జంట ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది. పెళ్లి తర్వాత మెగాడటర్ నటిస్తుందా లేదా అన్న సందేహాలకు చెక్ పెడుతూ.. నిహారిక మళ్ళీ నటించడానికి రెడీ అయ్యింది. అయితే నిహారిక వెబ్ సిరీస్‌ల్లో నటించడానికి భర్త, అత్త మామల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
నిహారిక హీరోయిన్‌గా వెండి తెరపై సక్సెస్ అందుకోలేదు కానీ.. నటనలో మాత్రం మంచి మార్కులే సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు వెబ్ సిరీస్‌ను పరిచయం చేసి.. ముద్దపప్పు అవకాయ్‌తో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చింది. నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ అందులో నటించింది. తనకు మంచి ఫేమ్ తెచ్చిన వెబ్ సిరీస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తూ.. మళ్ళీ నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యింది. శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నిహారికతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌ను రాయుడు చిత్రాలు అనే బ్యానర్‌పై భాను రాయుడు నిర్మిస్తున్నారు. యూట్యూబర్‌గా మంచి పేరున్న నిఖిల్ విజయేంద్ర నటిస్తున్నాడు. కీరవాణి సోదరుడు కల్యాణ్ మాలిక్ ఈ వెబ్ సిరీస్‌కు సంగీతం అందిస్తున్నారు.
Also Read: బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రవికృష్ణ పెళ్లి ఫిక్స్… రూమర్స్ కు చెక్ పెట్టిన తల్లి