Homemade Fertilizer: మీ మొక్కలు పుష్పించడం లేదా.. ఒక గుప్పెడు బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే..
పువ్వులు అంటే అందరికీ ఇష్టమే.. అందుకనే అపార్ట్ మెంట్ సంస్కృతి రోజు రోజుకీ పెరిగిపోతూ.. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే అవకాశం తరిగి పోతున్నా.. ఇంట్లో మొక్కలను పెంచుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు. టెర్రస్ పైనే కాదు.. ఇంట్లో బాల్కనీ లో ఎక్కడ పువ్వుల మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటే అక్కడ కుండీలు పెట్టుకుని మొక్కలను పెంచుతున్నారు. అయితే కొన్ని సార్లు పువ్వులు పూచిన తర్వాత మళ్ళీ పువ్వులు పుయ్యడం ఆగిపోతాయి. ఒకొక్కసారి మొక్కలు ఎండిపోతాయి కూడా.. అప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులనే ఎరువుగా ఉపయోగిస్తారు. కానీ ప్రయోజనం కనిపించదు. అప్పుడు ఈ సింపుల్ చిట్కాను ట్రై చేయండి.. ఎండిన మీ చెట్లు మళ్ళీ వికసిస్తాయి.

మొక్కల ప్రేమికుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమకు అందుబాటులో ఉన్న స్థలంలోనే మొక్కలను పెంచుకోవడానికి ట్రై చేస్తారు. అయితే కొన్ని సార్లు మొక్కలు పువ్వులను పూసిన తర్వాత మళ్ళీ మొగ్గ తొడగదు. ఒకొక్కసారి మొక్కలు ఎండిపోతాయి కూడా.. అప్పుడు మొక్కల సంరక్షణ కోసంమార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఎరువులతో పాటు, టీ పొడిని, కూరగాయలు కడిగిన నీరు, కూరగాయల తొక్కలు, గుడ్ల గుల్లలు వంటి వాటిని కూడా మొక్కలకు ఎరువుగా వేస్తారు. అయినా ఏమీ పని చేయకుండా ఒకప్పుడు రకరకాల రంగుల రంగుల పువ్వులతో అందంగా కనిపించే తోట.. ఎండిన చెట్లతో దర్శనమిస్తుంది.
మొక్కలకు ఆహారం ఎరువుల ద్వారా అందించబడుతుంది. సేంద్రీయ, రసాయన ఎరువులు రెండూ అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఒక గుప్పెడు బియ్యం చెట్లను కాపాడటంలో .. అవి మళ్ళీ పుష్పించేలా చేయడంలో మంచి ఎరువు అని మీకు తెలుసా.. బియ్యం మొక్కలోని పోషక విలువలను పెంచుతుంది. మానవులకు మంచి ఆరోగ్యం కోసం పొటాషియం, కాల్షియం, జింక్ , సోడియం వంటి ఖనిజాలు అవసరమైనట్లే, మొక్కలకు నత్రజని, భాస్వరం , పొటాషియం అవసరం. ఈ మూలకాలను మొక్కలకు బియ్యం అందిస్తుంది.
బియ్యంతో ఎరువు ఎలా చేయాలంటే
ఒక గాజు గిన్నెలో ఒక గుప్పెడు బియ్యం తీసుకోండి. ఆ బియ్యంలో కొంచెం నీరు పోసి.. మూతపెట్టి, ఇంట్లో చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశంలో గా గాజు గిన్నెను నిల్వ చేయండి. ఇలా మూడు నుంచి నాలుగు రోజులు ఈ బియ్యంతో ఉన్న గిన్నెను ఉంచండి. తరువాత బియ్యాన్ని వడకట్టి, నీరు వేరు చేయండి. ఇప్పుడు ఆ బియ్యం నీరుని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి.. మొక్కలపై పిచికారీ చేయాలి. ఇలా చేయడం వలన మొక్క తాజాగా ఉంటుంది. బియ్యాన్ని మొక్క నేల భాగంపై పోయండి. ఒక రోజంతా అలాగే ఉంచి.. మర్నాడు చెట్టు దగ్గర ఉన్న బియ్యాన్ని తీసి శుభ్రం చేయండి. లేకపోతే.. చీమలు పట్టే అవకాశం ఉంది. ఇలా రోజూ చేయడం వలన చాలా కాలంగా పువ్వులు పూయని మొక్క మళ్ళీ మొగ్గలు వేయడం మొదలు పెడుతుంది. పుష్కలంగా పువ్వులు వికసిస్తాయి. ఇలా కనీసం నెలకు రెండుసార్లు అయినా చేయండి..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..