డిస్పోజబుల్ కప్స్, కవర్స్.. డేంజర్ బెల్స్ వీడియో
నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్లాస్టిక్ లేకుండా మానవులకు ఏ పనికావడం లేదు. టీ, కాఫీ, టిఫిన్, భోజనం ఇలా అన్నింటిని నిషేధిత ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకొని ఆరగిస్తున్నాం. సిటీలో ప్రతి గల్లీకో కర్రీ పాయింట్ ఉంటుంది. అడుగడుగున ఓ టీ స్టాట్ ఉంటుంది. వాటిలో ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వేడి వేడి కూరలు, సాంబార్, హాట్ హాట్ టీ, కాఫీలు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. ఇలా వేడి వేడి పదార్థాల ప్లాస్టిక్‌లో ప్యాక్ చేయడం ఆరోగ్యానికి ప్రమాకరంగా మారుతోంది. డిస్పోజబుల్ కప్పుల్లో టీ, కాఫీ తాగడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
డిస్పోజబుల్ కప్పుల్లో తాగితే స్లో పాయిజన్ తాగినట్లేనని చెబుతున్నారు. ఎందుకంటే పేపర్ కప్పులో ద్రవం ఉండదు. వాటర్ఫ్రూఫింగ్ కోసం కాగితం కప్పులలో చాలా సన్నని ప్లాస్టిక్ పొర ఉంటుంది. దీన్నే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అయితే మనం టీ తాగడానికి వెళ్లినప్పుడు పేపర్ కప్పే మంచిదనుకొని దాంట్లోనే టీ తాగుతాం. కర్రీ పాయింట్‌లో ప్రతి దాన్ని కవర్లలో కట్టి ఇస్తుంటారు. ఈ వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లి తినడం వల్ల శరీరానికి హాని చేసే కారకాలు మన శరీరంలో చేరుతున్నాయి. ఇవి రక్తంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి రక్తప్రసరణకు ఆటంకంగా మారుతాయి. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జనం ఓ సంచి తమ వెంట తీసుకెళ్లేవారు. నిత్యావసరాలు, కూరగాయలు ఆ సంచిలో తెచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్లినా ఏం తెచ్చుకోవాలనుకున్నా ప్లాస్టిక్ కవర్లే ఉపయోగిస్తున్నారు. ఇలా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే చాలా ప్రమాదమని వైద్యులు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
మరిన్నివీడియోల కోసం:
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో
గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో
వీరు మాత్రం హలీమ్ తినకూడదంట! వీడియో
భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరురోజుల పాటు..!