Hyderabad: ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

Hyderabad: ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు! రెండు రోజుల్లో ఏడు మంది పీకల్ని కోసింది చైనా మాంజా. ఈ చైనా మాంజాపై హైదరాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చైనా మాంజా అమ్మే దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఎవరైనా చైనా మాంజాను అమ్మినట్లయితే కేసులతో పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటందని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

Hyderabad: ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Subhash Goud

Updated on: Jan 04, 2025 | 4:00 PM

రెండు రోజుల్లో ఏడు మంది పీకల్ని కోసిన చైనా మాంజా విషయాన్ని టీవీ9 ప్రధానంగా టేకప్ చేసింది. చైనా మాంజాపై నిషేధం ఉన్న విచ్చలవిడిగా జరుగుతున్న అమ్మకాలను ఎండగట్టింది. చైనా మాంజా ఏడు మంది ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం తెచ్చిందో సవివరంగా చూపించింది. దాని ఫలితంగా అధికారులు కదిలారు.

పతంగులకు, మాంజాల హోల్‌సేల్ విక్రయాలకు కేరాఫ్‌గా ఉన్న అఫ్జల్‌గంజ్‌, మంగళ్‌హాట్‌, ఓల్డ్‌సిటీలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. పదిలక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. గాజుపూత, కెమికల్స్‌ ఉండే చైనా మాంజా అమ్మవద్దని నిబంధనలు ఉన్నా ఎందుకు విక్రయిస్తున్నారంటూ కేసులు పెట్టారు. ఇందులో భాగంగా 15 మందిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. పతంగులు కాగితంతోనే చేస్తారు కావచ్చు. కానీ దాన్ని ఎగరేసే దారం విషయంలో మాత్రం చాలామంది చైనామాంజాను వాడుతున్నారు.

దానికి ఉన్న గాజుపూత, కెమికల్‌ పూతలతో అవి షార్ప్‌గా మారతాయి. ఎంత షార్ప్ అంటే.. వేగంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు ఆ మాంజా తగిలిందీ అంటే.. అంతే సంగతులు. పీక తెగుతుంది. ఈ చైనా మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా మార్కెట్‌లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ వారంలోనే హైదరాబాద్‌లో ఇలాంటివి మూడు నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఇక పతంగుల సీజన్‌లో అయితే వందలాది పక్షులు ఈ మాంజాకు బలవుతున్నాయి. అందుకే చైనా మాంజాపై కోర్టులు, ప్రభుత్వాలు నిషేధం విధించాయి.

ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని వ్యాపారస్తులను హెచ్చరించారు. కైట్స్ షాప్ నిర్వాహకులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోని పక్షంలో జైలుపాలు అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని సూచించారు. ఇందుకు ప్రజలు కూడా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రజలే దీన్ని ఒక బాధ్యతగా వహించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

అంతేకాకుండా, ఇంట్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దాంతో పాటు చైనా మాంజా విక్రయాలను అరికట్టేలా చర్యలపై టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు వివరించారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు