
కష్టపడకుండానే క్షణాల్లో డబ్బులు వచ్చి పడాలని భావించే యువతకు కొదవు లేదు. అందుకే అత్యాశతో చేసే పనుల వలన ఉన్నదంతా పోగొట్టుకుని లబోదిబోమని అంటున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ కు అలవాటు పడ్డాడు ఒక యువకుడు. తీరా ఆశ ఎక్కువ అవ్వడం తో డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాక తన ఇంటికే కన్నం వేశాడు ఒక సుపుత్రుడు. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నరేందర్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. తన తల్లిదండ్రులకు బ్యాంకు ఖాతా లేకపోవడంతో వారి నగదు మొత్తాన్ని కూడా నరేందర్ బ్యాంక్ ఖాతాలో వేసేవారు. తన బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బు ఉండటంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు కాబట్టి ఈజీ మనీ ని సంపాదించాలనుకున్నాడు.
యూట్యూబ్లో ఆన్లైన్ ట్రేడింగ్ ఎలా చేస్తారో తెలుసుకున్న నరేందర్ ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అయింది నరేందర్ పరిస్థితి. మొత్తం ఐదు లక్షలు నష్టం రావడంతో ఎలాగైనా సరే తిరిగి దానిని సంపాదించాలని పథకం వేశాడు. డబ్బులు మొత్తం అయిపోవడంతో ఇంట్లో ఉన్న వస్తువులు కాజేయాలని భావించాడు.
తన ఇంట్లో ఉన్న 3.5 లక్షల నగదు తో పాటు రెండున్నర తులాల బంగారాన్ని అపహరించాడు. ఈ డబ్బులను సైతం మళ్లీ ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేశాడు. వీటి ద్వారా తన అప్పులు క్లియర్ చేసుకోవాలని భావించాడు. కానీ ఈ డబ్బులు సైతం పోగొట్టాడు. తిరిగి తమ తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ఇంటికి ఎవరో దొంగతనం చేసినట్లు తన తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు మొత్తం చోరీకి గురైనట్టు ఇంట్లో ఉన్న వస్తువులను అన్నిటిని చెల్లాచెదురుగా పడేశాడు.
తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మీ సుపుత్రుడు నరేందర్ డే దొంగ తనం చేశాడంటూ తేల్చారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరపడంతో అసలు నిజం బయటపడింది. తానే ఈ దొంగతనం చేసినట్టు పోలీసుల ముందు నరేందర్ ఒప్పుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..