బండ్లగూడలో బరితెగించిన యువకుడు.. డేటింగ్ యాప్‌లో ఎదిరింటి మహిళ వివరాలు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు

ఇరుపొరుగు వారి గొడవలు కాస్త ఠాణాకు ఎక్కింది. ఎదురింటి వారితో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ప్రతికార్యానికి ఫ్లాన్ చేశాడు. ఏకంగా ఆ ఇంట్లోని మహిళ సెల్‌ఫోన్ నెంబర్‌ను డేటింగ్‌ యాప్‌లో పెట్టి మానసిక వేదనకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కు పంపించారు.

బండ్లగూడలో బరితెగించిన యువకుడు.. డేటింగ్ యాప్‌లో ఎదిరింటి మహిళ వివరాలు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు

ఇరుపొరుగు వారి గొడవలు కాస్త ఠాణాకు ఎక్కింది. ఎదురింటి వారితో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ప్రతికార్యానికి ఫ్లాన్ చేశాడు. ఏకంగా ఆ ఇంట్లోని మహిళ సెల్‌ఫోన్ నెంబర్‌ను డేటింగ్‌ యాప్‌లో పెట్టి మానసిక వేదనకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కు పంపించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగోల్‌ ఏరియాకు చెందిన బండ్లగూడలోని ఇంద్రప్రస్థ కాలనీలో నివాసముంటున్న గడ్డం రూబీకిరణ్‌ (38) ఓ ప్రెవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతడి కుటుంబానికి ఎదురింట్లో ఉన్న మరో కుటుంబానికి చిన్నచిన్న గొడవలు జరిగాయి. వీటిని మనసులో పెట్టుకున్న రూబీకిరణ్‌.. ఎదురింటి మహిళకు సంబంధించి వివరాలతో మెయిల్‌ ఐడీ క్రియేట్ చేసి
అసభ్యకర రాతలతో పాటు ఆమెను వ్యభిచారిగా చిత్రిస్తూ.. ఫోన్‌ నెంబర్‌ను డేటింగ్‌ యాప్‌లో ఉంచాడు. దీంతో ఆమెకు ఫోన్‌లు, మెసేజ్‌లు చేయడంతో షాక్‌కు గురైంది. వరుసగా వస్తున్న ఈ వేధింపులు తాళలేని సదరు మహిళ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక ఆధారాల ద్వారా రూబీకిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అతడినుంచి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.