AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కిలాడీ దంపతులు.. ఫేస్‌బుక్‌లో ప్రేమ, ఉద్యోగాల పేరుతో వల.. వెలుగులోకి భారీ మోసం..

Cheated Couple Arrest: ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్లు తెరుస్తారు.. ఆ తర్వాత కొందరికి ప్రేమ, ఉద్యోగాలిస్తామంటూ మెస్సెజ్‌లు చేసి డబ్బు దండుకుంటారు. అలాంటి కిలాడీ

Hyderabad: కిలాడీ దంపతులు.. ఫేస్‌బుక్‌లో ప్రేమ, ఉద్యోగాల పేరుతో వల.. వెలుగులోకి భారీ మోసం..
Arrested
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2021 | 8:06 AM

Share

Cheated Couple Arrest: ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ తెరిచారు. ఆ తర్వాత కొందరికి ప్రేమ, ఉద్యోగాలిస్తామంటూ మెస్సెజ్‌లు చేసి రూ.లక్షలు డబ్బు దండుకున్నారు. అలాంటి కిలాడీ దంపతుల ఆటకట్టించారు హైదరబాద్ సైబర్ క్రైం పోలీసులు.. ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలతో ప్రేమ, ఉద్యోగాలిస్తామంటూ మోసం చేస్తున్న కిలాడీ దంపతులను గురువారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దంపతులిద్దరూ చాలా మందిని మోసం చేశారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన పొన్నం నవీన్‌కుమార్‌, భార్య శిరీషతో కలిసి హైదరబాద్ నగరంలోని లింగంపల్లిలో ఉంటున్నాడు. వీరికి మూడు నెలల శిశువు ఉంది. అయితే అంతకుముందు నవీన్ ఓ మెడికల్‌ షాప్‌లో క్యాషియర్‌గా పనిచేశాడు. సంపాదన సరిపోకపోవడంతో మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి భార్య కూడా సహకరించింది.

అనంతరం ఇద్దరూ కలిసి ఫేస్‌బుక్‌లో శ్వేతారెడ్డి పేరిట నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశాడు. యువకులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు, మెస్సెజ్‌లు పంపించారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కాడు. ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. ప్రాసెసింగ్‌ తదితర ఖర్చుల పేరుతో రూ.8 లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నవీన్ భార్య ప్రేమ పేరుతో మరో రూ.2.50 లక్షలు బదిలీ చేయించుకుంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌కు చెందిన మరొకరిని సైతం మోసం చేసి రూ.2 లక్షల తీసుకున్నారు.

అనంతరం ఉన్నట్టుండి ఈ కిలాడీ దంపతులు ఫోన్‌ ఆపేయడంతో బాధితులు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అంతకుముందు ఈ కిలాడీ దంపతులపై రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లలోనూ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. అనంతరం.. నవీన్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. మూడు నెలల పసిపాప ఉండటంతో శిరీషకు నోటీసులిచ్చి పంపించినట్లు పేర్కొన్నారు.

Also Read:

Female SI Suicide: పెళ్లి కావడం లేదంటూ మహిళా ఎస్ఐ బలవన్మరణం.. విషం తాగిన అధికారిణి..

Kiara Advani: ఏంటమ్మ కియారా ఇలా చేసావు.. తప్పు కదు.. హీరోయిన్‏పై మండిపడుతున్న నెటిజన్లు..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ