Female SI Suicide: పెళ్లి కావడం లేదంటూ మహిళా ఎస్ఐ బలవన్మరణం.. విషం తాగిన అధికారిణి..
Woman si kavita solanki suicide: ఆమె కష్టపడి చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించుకుంది.. అది కూడా సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం.. వయసు 35 సంవత్సరాలు.. అన్నీ ఉన్నా ఆమెకు
Woman SI Kavita Solanki Suicide: ఆమె కష్టపడి చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించుకుంది.. అది కూడా సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం.. వయసు 35 సంవత్సరాలు.. అన్నీ ఉన్నా ఆమెకు పెళ్లి కావడం లేదనే అసంతృప్తి మిగిలిపోయింది. ఎవరు కంటపడినా.. ఆమెను పెళ్లి గురించే ఆరా తీస్తున్నారు. నిత్యం స్నేహితులు, బంధువులు పెళ్లి గురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. ఆ మహిళా ఎస్ఐ తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో డిప్రెషన్‌కు గురై విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ రత్లాంలో చోటుచేసుకుంది. వివరాలు.. మహిళా ఎస్ఐ పేరు కవితా సోలంకి. రత్లాం స్టేషన్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఇన్‌ఛార్జ్‌గా కవితా సోలంకి పనిచేస్తోంది.
ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులను కలిసిందేకు మాండ్సౌర్ జిల్లా వెళ్లింది. అనంతరం ఇంటి నుంచి వచ్చి కవితా బుధవారం ఉదయం డ్యూటీలో జాయిన్ అయింది. ఆ తర్వాత కొంత సేపటికే నివాసానికి వెళ్లి విషం తాగింది. అనంతరం ఈ విషయాన్ని తన సహోద్యోగులకు చెప్పడంతో వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ.. గురువారం మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే విషం తాగే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు వెల్లడించారు.
వయసు దాటిపోతున్నా పెళ్లి జరగడం లేదని కవితా సోలంకి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు రత్లాం ఎస్పీ గౌరవ్ తివారి తెలిపారు. స్నేహితులు, బంధువులు పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు ఆమెకు మరింత డిప్రెషన్‌కు గురిచేశాయని.. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు గౌరవ్ తివారి పేర్కొన్నారు.
Also Read: