కొత్త ఏడాదిలో తొలి పెద్ద కేసు: 12 గంటల్లో తేల్చేసిన పోలీసులు, వీడిన కాచిగూడ గోకుల్‌ధామ్ అపార్ట్‌మెంట్ చోరీ మిస్టరీ

హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీటూరిస్టు హోటల్‌ వెనుక ఉన్న అపార్ట్ మెంట్ లో జరిగిన చోరీ కేసు మిస్టరీ వీడింది. కేవలం 12..

  • Venkata Narayana
  • Publish Date - 4:51 pm, Sat, 2 January 21
కొత్త ఏడాదిలో తొలి పెద్ద కేసు: 12 గంటల్లో తేల్చేసిన పోలీసులు, వీడిన కాచిగూడ గోకుల్‌ధామ్ అపార్ట్‌మెంట్ చోరీ మిస్టరీ

హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని టూరిస్టు హోటల్‌ వెనుక ఉన్న అపార్ట్ మెంట్ లో జరిగిన చోరీ కేసు మిస్టరీ వీడింది. కేవలం 12 గంటల్లో కేసును చేధించారు పోలీసులు. డిసెంబర్ 31న గోకుల్ ధామ్ అపార్ట్ మెంట్ లో దొంగతనానికి పాల్పడిన అపార్ట్ మెంట్ లో పనిచేసే సెక్యూరిటీని అరెస్ట్ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. 35 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ను అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు నంద కుసరాజు అలియాస్ నంద గోపాల్ నుండి 65 తులాల బంగారం, 55 తులాల వెండి దాదాపు 35 లక్షలు విలువ చేసే సొత్తును రికవరీ చేశామని తెలిపారు. కేసు పూర్వాపరాలు వెల్లడిస్తూ.. “నిందితుడు నంద కుసరాజు అలియాస్ నందగోపాల్‌ది ఈస్ట్ గోదావరి జిల్లా రామనయ్యపేట స్వస్థలం. 10వ తరగతి వరకు చదువుకున్న నందగోపాల్…7ఏళ్లు డైలీ కూలిగా పని చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కుసరాజు పేరును నందగోపాల్ గా మార్చుకున్నాడు. 2018 లో పేపర్ యాడ్ చూసి గోకుల్‌ధాం అపార్ట్మెంట్ లో మేల్ కేర్ టేకర్ గా సీతారాం కాలే ఇంట్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు తను ఫేక్ ఆధార్ కార్డ్ నందగోపాల్ గా సృష్టించి జాయిన్ అయ్యాడు. నందగోపాల్ నారాయణగూడా లోని ఓ వ్యక్తి సహాయంతో దొంగ తాళాలు తయారు చేశారు. ఇంటి యజమాని సీతారాంకాలే హాస్పిటల్ లో జాయిన్ అవ్వడంతో ఇదే అదునుగా భావించాడు నందగోపాల్. డూప్లికేట్ తాళాల్తో బంగారం, వెండి, నగదు చోరీ చేసాడు. ఇంటి యజమానులు ఛాయా విజయ కాలే, సీతారాం కాలే హాస్పిటల్ నుండి వచ్చి చూశాక ఇంట్లో ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. గతంలో నందగోపాల్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగ తనం చేసాడు. కానీ యజమాని కాంప్రమైజ్ అవ్వడంతో నందగోపాల్ గురించి పోలీస్ రికార్డ్స్ లో లేవు.” అని సీపీ చెప్పారు.