Hyderabad: పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి వచ్చాడో.. లేదో.. కాసేపటికే.!
విషయం తెలుసుకున్న పరమేశ్ అనూష తల్లిదండ్రులను సముదాయించి, "ఇకపై గొడవలు జరిగవని" హామీ ఇచ్చి భార్యను ఇంటికి తీసుకువచ్చాడు.అయితే తీసుకువచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ తీవ్ర కలహం జరిగి పరమేశ్ భార్యను నడి రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టాడు. భార్య అనూషపై పదేపదే..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ కాలనీలో ప్రేమ వివాహం చేసుకున్న భార్య అనూష(22)పై భర్త పరమేశ్ కుమార్ దాడి చేసి హత్య చేసాడు. కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల వ్యతిరేకత మధ్య జరిగిన ఈ దారుణ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయిపూర్ కాలనీలోనే నివసించే పరమేశ్ కుమార్, అనూష 8 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ పెళ్లికి పరమేశ్ కుటుంబీకులు వ్యతిరేకత చూపించడంతో తరచూ కాపురంలో చిన్న చిన్న గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం మళ్లీ ఇంట్లో కొద్దిపాటి గొడవ జరిగి అనూష తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
విషయం తెలుసుకున్న పరమేశ్ అనూష తల్లిదండ్రులను సముదాయించి, “ఇకపై గొడవలు జరిగవని” హామీ ఇచ్చి భార్యను ఇంటికి తీసుకువచ్చాడు.అయితే తీసుకువచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ తీవ్ర కలహం జరిగి పరమేశ్ భార్యను నడి రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టాడు. భార్య అనూషపై పదేపదే పిడి గుద్దులతో దాడి చేసిన పెద్ద కర్రతో తలపై కొట్టాడు. తలకు తీవ్రగాయాలు పాలై స్పృహ కోల్పోయిన అనూషను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
పరమేష్ అనూషపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అనూష సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పరమేశ్ కుమార్తో పాటు అతని తల్లిపై కూడా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఘటన తెలుసుకున్న వెంటనే పరమేశ్ పారిపోయాడు. తాండూరు పట్టణ పోలీసులు భార్యాభర్తల మధ్య కలహం కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ, పెళ్లికి కుటుంబ వ్యతిరేకత ప్రధాన కారణంగా చిన్న చిన్న గొడవలు తీవ్రమవడం దాడికి కారణం అయింది. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకుని న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








