‘సర్కారు వారి పాట’ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ .. జనవరి నుంచి ఏకధాటిగా షూటింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్తం సర్కారు వారి పాట ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్తం ‘సర్కారు వారి పాట’ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వరుసగా హిట్లు కొడుతున్న మహేష్ మరోసారి ‘సర్కారు వారి పాట’తో సాలిడ్ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ‘గీత గోవిందం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది.
కథాప్రకారం ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో ప్లాన్ చేసుకున్నారు చిత్రయూనిట్. కానీ కరోనా కారణంగా అక్కడ షూట్ చేసే అవకాశం కనిపించకపోవడంతో హైదరాబాద్ లోనే షూటింగ్ చేయనున్నారు. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. జనవరి నుంచి మొదలుపెట్టి శరవేగంగా సినిమాను పూర్తి చేయనున్నారు. బ్యాంకింగ్ రంగాల్లో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఆ మధ్య విడుదలైన ప్రీ లుక్ లో లాంగ్ హెయిర్ స్టైల్ తో, మెడమీద రూపాయి టాటూతో ఆకట్టుకున్నాడు మహేష్. మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుందేమో చూడాలి.