AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు వాజ్‌పేయి ‘చతుర్భుజి’ ఒక యజ్ఞం! నేడు ఎక్స్‌ప్రెస్‌వేల వేగం ఒక అద్భుతం!

అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ చెప్పిన ఓ వండర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఉంది. అమెరికా సంపన్న దేశం కాబట్టి ఇక్కడ రోడ్లు బాగున్నాయని కాదు.. ఇక్కడ రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా సంపన్నమైన దేశం అయింది అని చెప్పారాయన. అమెరికా, జర్మనీ, జపాన్ లాంటివి దేశాలు ధనిక దేశాలు కాబట్టి అక్కడ రోడ్లు బాగున్నాయని అనుకుంటారు చాలామంది. అసలు నిజం ఏమిటంటే.. అక్కడ రోడ్లు బాగున్నాయి కాబట్టే ఆ దేశాలు అంతలా అభివృద్ధి చెందాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మొదలైన స్వర్ణ చతుర్భుజి.. దేశ ఆలోచనా దృక్పథాన్ని మార్చేసింది. అప్పటివరకు రోడ్లు అంటే కేవలం ఊర్లను కలిపేవి మాత్రమే అనుకునేవాళ్లు. కానీ, అవే దేశ ఆర్థిక ప్రగతిని మార్చేశాయి. రోడ్లను, అభివృద్ధిని విడదీసి చూడలేం. అది అసాధ్యం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు మాత్రమే కాదు.. హైస్పీడ్ రైల్ కారిడార్ల వల్ల కూడా ఈ దేశ దశ మారింది. చెప్పుకోడానికి కావాల్సినంత డేటా కూడా ఉంది. భారత్ చాలా స్పీడ్‌గా జపాన్‌ను సైతం దాటేసి గతేడాది 4వ ర్యాంక్‌కు చేరుకుంది. అందుకు ఒకానొక కారణం.. ఈ రోడ్లు, రైళ్ల కారిడార్లే. సో, ఇంకాస్త డిటైల్డ్‌గా తెలుసుకుందాం..

నాడు వాజ్‌పేయి 'చతుర్భుజి' ఒక యజ్ఞం! నేడు ఎక్స్‌ప్రెస్‌వేల వేగం ఒక అద్భుతం!
Highway Development India
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2026 | 10:03 PM

Share

రోడ్లు వేయడం కూడా ఒక అభివృద్ధేనా.. దానికీ గప్పాలు కొట్టుకోవడమేనా.. అని అంటుంటారు కొందరు అత్యుత్సాహవంతులు. ఓ డేటా చెబుతా వినండి. కొత్తగా హైవేలు పడిన చోట.. ఆ చుట్టుపక్కల జిల్లాల్లో బ్యాంకులు ఇచ్చే లోన్లు 20 టు 30 పర్సెంట్ పెరిగింది. అంటే అర్థం.. అక్కడ కొత్త వ్యాపారాలు మొదలయ్యాయని. ఈ రోడ్లే.. పంట నష్టాన్ని తగ్గించాయంటే నమ్మగలరా. పోస్ట్-హార్వెస్ట్లాస్ అంటారు. కూరగాయలు, పండ్లు ఎంత త్వరగా మార్కెట్‌కు తీసుకెళ్తే అంత లాభం. అదే జరిగింది హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు వేయడం వల్ల. అంతేనా.. కూరగాయలు, పండ్ల ధరలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకు, మీరట్ టు ప్రయాగ్‌రాజ్ వెళ్లడానికి ఒకప్పుడు 12 గంటలు పట్టేది. ఇప్పుడు గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అది 6 గంటలకు తగ్గుతుంది. అంటే ఒక లారీ డ్రైవర్ రోజుకు రెండు ట్రిప్పులు వేయగలడు. దీనివల్ల వస్తువుల ధరలు తగ్గి సామాన్యుడికి మేలు జరుగుతుంది. ఇలా ఒక్కటని కాదు.. ఎన్నో ఇంటర్ లింక్స్ ఉన్నాయ్ ఈ రోడ్లతో. స్ట్రెయిట్‌గా.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన ఒక స్టేట్‌మెంట్‌కి వద్దాం. హైదరాబాద్ నుంచి అమరావతికి జస్ట్ 70 నిమిషాల్లో చేరుకోవచ్చు అన్నారు. అంటే గంటా పది నిమిషాల్లో వెళ్లొచ్చు. అయితే మాత్రం ఏంటి లాభం అంటారేమో. హైస్పీడ్ రైల్ అనుసంధానం ఉన్న నగరాల జీడీపీ 2.7 శాతం పెరుగుతుందని ఇంటర్నేషనల్ రీసెర్చ్ చెబుతోంది. ప్రయాణ సౌలభ్యం ఒక శాతం పెరిగితే.. ఆ ప్రాంత అభివృద్ధి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి