North Korea: అక్కడ బ్రతుకు కంటే చావే నయం.. డిక్టేటర్ కిమ్‌పై తీవ్ర విమర్శలు

రష్యాకు మద్దతుగా కిమ్‌ సేన ఉక్రెయిన్‌తో యుద్ధంలో పోరాటం చేస్తోంది. అయితే.. రష్యా ఈ విషయాన్ని కొట్టిపారేస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్‌ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా.. కుర్సుక్‌ రీజన్‌లో

North Korea: అక్కడ బ్రతుకు కంటే చావే నయం.. డిక్టేటర్ కిమ్‌పై తీవ్ర విమర్శలు
Kim
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 15, 2025 | 2:39 PM

రష్యాకు మద్దతుగా కిమ్‌ సేన ఉక్రెయిన్‌తో యుద్ధంలో పోరాటం చేస్తోంది. అయితే.. రష్యా ఈ విషయాన్ని కొట్టిపారేస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్‌ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా.. కుర్సుక్‌ రీజన్‌లో ఉక్రెయిన్‌ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా.. ఉక్రెయిన్‌ సైనికులను చూసి గ్రెనేడ్‌తో తనను తాను పేల్చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్సెస్‌ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ఓ పదివేల మంది సైన్యాన్ని రష్యాకు మద్దతుగా పంపారు. అయితే ఆ సైనికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తాజాగా ఉక్రెయిన్‌ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో చెబుతుండటం సంచలనంగా మారింది. యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్‌కు పట్టుబడితే.. యుద్ధ ఖైదీలుగా ఉండిపోవాలి. అంతేకాదు, యుద్ధ నేరాల్లో కొరియా పాత్ర కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్‌లో యుద్ధ ఖైదీలుగా మిగలడం కన్నా.. ఆత్మాహుతికి పాల్పడడం మేలని వాళ్లు భావిస్తున్నారనీ ‘‘పట్టుబడకుండా ప్రాణం తీసుకోవడం.. ఇదే కిమ్‌ సైన్యం తమకు నేర్పిందని ఉత్తర కొరియా మాజీ సైనికుడొకరు చెప్పడం ప్రకంపనలు రేపుతోంది.

ఆ సైనికుడే ఇంకా ఏం చెప్పాడంటే.. ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే.. ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి. ఇల్లు, భార్యాపిల్లలు అన్నింటిని వదిలేసుకోవాలి. సైన్యంలో బ్రెయిన్‌వాష్‌ చేస్తారు. కిమ్‌ కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాలని చెబుతారని అన్నాడు. యుద్ధక్షేత్రం నుంచి తిరిగి ప్యాంగ్‌యాంగ్‌కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే అనీ ఆఖరికి తూటా శరీరంలో దిగాల్సిందే ననీ ఆ సైన్యంలో అంతా చర్చించుకునేది ఇదే అని ఆ సైనికుడు తెలిపాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..