AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేములవాడ ఆలయంలో నిజాయితీకి నిదర్శనం.. రూ.8 లక్షల బంగారు బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుడు రేసు సతీష్ పోగొట్టుకున్న సుమారు రూ.8 లక్షల విలువైన బంగారు బ్రాస్లెట్‌ను ఔట్‌సోర్సింగ్ సిబ్బంది డప్పు నాగమణి నిజాయితీగా తిరిగి అప్పగించారు. ఆలయ అధికారులకు అందించగా, వారు విచారణ అనంతరం భక్తుడికి అందజేశారు. ఈ నిజాయితీకి నాగమణిని ఆలయ ఈవో ప్రశంసించి, సత్కరించారు. ఈ ఘటన మానవత్వం, నిజాయితీ విలువలను చాటింది.

వేములవాడ ఆలయంలో నిజాయితీకి నిదర్శనం.. రూ.8 లక్షల బంగారు బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది..!
Temple Staff Honesty
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 6:51 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుడు పోగొట్టుకున్న విలువైన బ్రాస్లెట్‌ను ఆలయ సిబ్బంది నిజాయితీగా తిరిగి అప్పగించారు. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రేసు సతీష్ స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు చెందిన సుమారు నాలుగు తులాల బంగారు బ్రాస్లెట్ (అంచనా విలువ రూ.8 లక్షల వరకు) ఆలయంలో ఎక్కడో పడిపోయింది.

ఆలయంలో ఔట్‌సోర్సింగ్ స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న డప్పు నాగమణికి ఆ బ్రాస్లెట్ దొరికింది. ఆమె వెంటనే ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ గారికి, పోలీసు సిబ్బందికి అందజేశారు. అనంతరం బ్రాస్లెట్ పోగొట్టుకున్న భక్తులు ఆలయానికి వచ్చిన తరువాత ఎంక్వయిరీ నిర్వహించి, ధృవీకరించిన అనంతరం వారికి తిరిగి అప్పగించారు.

ఇవి కూడా చదవండి
Honest Temple Staff

నిజాయితీగా వ్యవహరించి బ్రాస్లెట్‌ను అప్పగించిన డప్పు నాగమణిని ఆలయ అధికారులు అభినందించారు. ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారి ఆదేశాల మేరకు ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ గారు ఆమెకు స్వామివారి, అమ్మవార్ల వస్త్రం మరియు లడ్డూ ప్రసాదం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే