10 వేల రూపాయల వరదసాయం పంపిణీ కొనసాగించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు వ్యాఖ్యలు
జంటనగరాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన హైదరాబాద్ నగర వాసులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న10 వేల రూపాయల వరదసాయం పంపిణీ కొనసాగించాలన్న వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వరదసాయం పదివేలు ఆపాలంటూ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది శరత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. […]
జంటనగరాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన హైదరాబాద్ నగర వాసులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న10 వేల రూపాయల వరదసాయం పంపిణీ కొనసాగించాలన్న వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వరదసాయం పదివేలు ఆపాలంటూ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది శరత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
అనంతరం వరదసాయం పంపిణీపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుమందు, స్పెషల్ జిపి శరత్ ఈ అంశంపై లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. వరద సహాయం కొనసాగించే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ను శరత్ కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విపత్కర పరిస్థితుల్లో వర్తించదని శరత్ వాదించారు. అయితే, ఎన్నికల సమయంలో ఇలా 10 వేలు చొప్పున ప్రజలకు ఇవ్వడం వలన ఓటర్ల పై ప్రభావం పడుతుందని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది విద్యాసాగర్ కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు.