సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అతని స్నేహితురాలు రోహిణి అయ్యర్ స్పందించారు. కపట స్నేహితులకు, ఫోన్ కాల్స్‌కు అతను ఎప్పుడూ దూరంగా ఉండేవాడు. బాలీవుడ్ అతన్ని దూరం పెట్టలేదు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బీ-టౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజమే కారణమని సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఇండస్ట్రీని ఏలుతున్న కొందరు ప్రముఖులు సుశాంత్‌ను పక్కన పెట్టడమే కాకుండా.. అతని కెరీర్‌ను నాశనం చేశారని కొంతమంది నెటిజన్ల నుంచి వాదన వినిపిస్తోంది. తమ సినీ కుటుంబంలో ఒక వ్యక్తిగా సుశాంత్‌ను ఆదరించలేదు కాబట్టే ఆటను డిప్రెషన్‌కు లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్‌తో సహా 8 మంది బీ-టౌన్ పెద్దలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలో సుశాంత్ స్నేహితురాలు రోహిణి అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు.
”నా బెస్ట్ ఫ్రెండ్ లేదు అనే వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అతనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎక్కువ శాతం కల్పితమైనవే. మొదటిగా అతను ఫేమ్ గురించి ఎప్పుడూ తాపత్రయపడలేదు. అతను సన్నిహాతంగా ఉండటం గురించి పట్టించుకోలేదు. కపట స్నేహితులకు, ఫోన్ కాల్స్‌కు అతను ఎప్పుడూ దూరంగా ఉండేవాడు. బాలీవుడ్ అతన్ని దూరం పెట్టలేదు. అతనే ఆ పార్టీలు వద్దనుకున్నాడు. అతను ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. అతనికి తన సొంత రాజ్యం ఉంది. అతను ఒక పోరాట యోధుడు. అతను బాలీవుడ్‌లోకి ఎలాంటి నేపధ్యం లేకుండానే వచ్చాడు. ఇక ఆ విషయం గురించి, సినీ కుటుంబంలో ఒకడిగా లేను అనే దానిపై ఎప్పుడూ బాధపడలేదు.”
”అందుకు కారణం అతడికి సినీ పరిశ్రమ కంటే మించి వేరే జీవితం ఉంది. బాలీవుడ్ అతని జీవితంలో ఒక భాగం మాత్రమే. అతను విజయం గురించి పట్టించుకోలేదు. అలా అని ఫెయిల్ అవ్వలేదు కూడా. ఎన్నో సూపర్ హిట్స్ అందించాడు. అతను అవార్డుల గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒక అవార్డు ఫంక్షన్‌లో అతనికి ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చే ముందు బోర్ కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతనొక క్రేజీ జీనియస్. కవితలు రాసేవాడు, గిటార్ వాయించేవాడు. మార్స్ మీదకు వెళ్లాలనుకునేవాడు, అతను స్వచ్ఛంద సంస్థలలో, సైన్స్ ప్రాజెక్టులలో, గొప్ప ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టాడు. కాబట్టి దయచేసి అతని ప్రతిభను తగ్గించే విధంగా మీ సొంత అజెండా కోసం పిచ్చి రాతలు రాయొద్దు.’ అని రోహిణి అయ్యర్ పోస్ట్ పెట్టింది”.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!
దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..
బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..