అసోంలో పెరుగుతున్న కేసులు.. తాజాగా మరో 82..

అసోంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు వేల మార్క్ దాటి.. ఐదువేలకు చేరువలో ఉంది.

అసోంలో పెరుగుతున్న కేసులు.. తాజాగా మరో 82..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2020 | 5:36 PM

అసోంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు వేల మార్క్ దాటి.. ఐదువేలకు చేరువలో ఉంది. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,777కి చేరింది. ఈ విషయాన్ని అసోం ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,111 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 2,654 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 9 మంది మరణించారన్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,46,590 శాంపిల్స్ టెస్ట్స్‌ చేశామని.. జూన్ 17వ తేదీన ఒక్కరోజే 11 వేల టెస్టులు చేశామని వివరించారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 3.66 లక్షల కేసులు నమోదవ్వగా.. 1.94 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 12వేల మందికి పైగా మరణించారని తెలిపారు.