AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ప‌త్రి నుంచి త‌ప్పించుకున్న క‌రోనా పేషెంట్…చివ‌ర‌కు చిక్కాడిలా!

హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుడు త‌ప్పించుకున్నాడ‌నే వార్త న‌గ‌రంలో ఇటీవ‌ల క‌ల‌క‌లం రేపింది. అయితే, ఎట్ట‌కేల‌కు అధికారులు అత‌డి ఆచూకీ తెలుసుకుని తిరిగి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఆస్ప‌త్రి నుంచి త‌ప్పించుకున్న క‌రోనా పేషెంట్...చివ‌ర‌కు చిక్కాడిలా!
Jyothi Gadda
|

Updated on: Jun 18, 2020 | 5:30 PM

Share
హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుడు త‌ప్పించుకున్నాడ‌నే వార్త న‌గ‌రంలో ఇటీవ‌ల క‌ల‌క‌లం రేపింది. అయితే, ఎట్ట‌కేల‌కు అధికారులు  అత‌డి ఆచూకీ తెలుసుకుని తిరిగి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వివ‌రాల్లోకి వెళితే…
వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన ఓ వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అత‌డు కరోనా బారిన పడ్డాడు. చికిత్స కోసం జూన్ 15న కింగ్ కోఠి ఆస్ప‌త్రిలో చేరాడు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం ఉద‌యం ఆస్ప‌త్రి నుంచి తప్పించుకున్నాడు. ఎల్బీ నగర్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి సూర్యాపేట వెళ్లాడు. అక్కడ మరో బస్సెక్కి తొర్రూర్ వెళ్లిన‌ట్లు అధికారులు గుర్తించారు.
ఈ క్ర‌మంలో బాధితుడు త‌న త‌మ్ముడికి ఫోన్ చేసిన తాను ఇంటికి వ‌స్తున్న‌ట్లుగా చెప్ప‌డంతో అత‌డు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. దీంతో అలెర్ట్ అయిన వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా సోకిన వ్యక్తి తొర్రూరు బస్టాండ్‌కు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. అత‌డికి వెంట‌నే పీపీఈ కిట్ తొడిగించి అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి తరలించారు. మ‌రోవైపు అత‌డు ప్ర‌యాణించిన బ‌స్సులో ఉన్నతోటి ప్ర‌యాణికుల‌పై ఆరా చేప‌ట్టారు.

Follow Us
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
పుట్టగొడుగులు త్వరగా పాడవుతన్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
పుట్టగొడుగులు త్వరగా పాడవుతన్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం
మీ లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!
మీ లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!
పిచ్ మార్చమని చెప్పినా వినలే.. అతను ఉన్నంతసేపు నరకం చూశాం..!
పిచ్ మార్చమని చెప్పినా వినలే.. అతను ఉన్నంతసేపు నరకం చూశాం..!
బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
హమ్మయ్య..త్వరలో వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
హమ్మయ్య..త్వరలో వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
అల్ ఇన్ వన్ కారం పొడి.. టిఫిన్స్ ,అన్నం లోకి సూపర్ గా ఉంటది
అల్ ఇన్ వన్ కారం పొడి.. టిఫిన్స్ ,అన్నం లోకి సూపర్ గా ఉంటది
మీ బ్రెయిన్ పవర్ హఠాత్తుగా తగ్గిపోతోందా?.. ఇదే కారణం
మీ బ్రెయిన్ పవర్ హఠాత్తుగా తగ్గిపోతోందా?.. ఇదే కారణం