హెచ్‌సీయూ సంచలన నిర్ణయం : ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు ఆర్థిక సాయం
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేద విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు స్టూడెంట్ల నుంచే ఫీజులు దండుకుంటుండగా… హెచ్‌సీయూ మాత్రం క్లాసులు వినేందుకు స్టూడెంట్లకే ఆర్థికసాయం చేయాలని డిసైడయ్యింది.
HCU Online classes : కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేద విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు స్టూడెంట్స్ నుంచి ఫీజులు దండుకుంటుండగా… హెచ్‌సీయూ మాత్రం క్లాసులు వినేందుకు స్టూడెంట్లకే ఆర్థికసాయం చేయాలని డిసైడయ్యింది. డిజిటల్ యాక్సెస్ గ్రాంట్ (డీఏజీ) కింద పేద విద్యార్థులందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి సీనియర్ ప్రొఫెసర్ వినోద్ పవరాలా నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. ఆ కమిటీ పలు సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం రిపోర్టును వీసీ అప్పారావుకు అందజేసింది. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చెయ్యాలని, ఇంటర్నెట్ డేటా కోసం పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందజేయాలని కమిటీ సూచించింది. దీనిపై వీసీ… డిపార్ట్మెంట్ హెడ్స్, డీన్స్ తో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ నెల 20 నుంచి దాదాపు 2వేల మంది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
బోర్డింగ్ అలవెన్స్ సౌకర్యం అందుకుంటున్న విద్యార్థులకు డిజిటల్ యాక్సెస్ గ్రాంట్( డీఏజీ) కింద నెలకు రూ.వెయ్యి ఇవ్వనున్నారు. దీని ద్వారా పేద విద్యార్థులకు క్లాసులు వినడానికి ఎటువంటి ఆటంకం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
Read More : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత