‘అల దుబాయ్’లో డేవిడ్ భాయ్.. పోరుకు సిద్ధం.!

'అల దుబాయ్'లో డేవిడ్ భాయ్.. పోరుకు సిద్ధం.!

ఐపీఎల్...  ఈ పేరు వింటే చాలు. ఒకవైపు సిక్సర్ల హోరు.. మరోవైపు వికెట్ల జోరు గుర్తొస్తుంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ లీగ్ కోసం ఎదురు చూస్తోంది.

Ravi Kiran

|

Aug 08, 2020 | 3:32 PM

David Warner Crazy Still: ఐపీఎల్…  ఈ పేరు వింటే చాలు. ఒకవైపు సిక్సర్ల హోరు.. మరోవైపు వికెట్ల జోరు గుర్తొస్తుంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ లీగ్ కోసం ఎదురు చూస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆలస్యమైనా ఈ టోర్నీ యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీనితో ఫ్యాన్స్  సందడి మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ల ఫోటోలను కట్ చేసి అద్భుతంగా ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులు తయారు చేసిన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సితరాల సిరపడు’ పాటలో అల్లు అర్జున్ కోడి, కత్తి పట్టుకుని విలన్ ఇంటికి వెళ్లే సీన్‌లోకి వార్నర్‌ను తీసుకొచ్చారు. ‘అల దుబాయ్‌లో’ అనే టైటిల్ పెట్టి ఒక చేతికి కోడి, మరో చేతికి బ్యాట్ అందించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వార్నర్ దీన్ని షేర్ చేసి స్మైలీ సింబల్స్ పెట్టాడు. ఇక నెటిజన్లు, ఫ్యాన్స్ అయితే.. డేవిడ్ భాయ్ ఐపీఎల్ కోసం దుబాయ్ వచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్ సర్కార్..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu