హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నిక: వివేక్‌కు షాక్
హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ వివేక్‌కు షాక్ తగిలింది. ప్రస్తుతం హెచ్‌సీఏలో వివిధ పదవుల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ వ్యవహాల్లో చురుగ్గా పాల్గొనే వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని ఆశించాడు. ఇందుకోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే పరిశీలన దశలోనే ఈ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో వివేక్ అధ్యక్ష ఆశలు గళ్లంతయ్యాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల పొందుతూ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో […]

హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ వివేక్‌కు షాక్ తగిలింది. ప్రస్తుతం హెచ్‌సీఏలో వివిధ పదవుల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ వ్యవహాల్లో చురుగ్గా పాల్గొనే వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని ఆశించాడు. ఇందుకోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే పరిశీలన దశలోనే ఈ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో వివేక్ అధ్యక్ష ఆశలు గళ్లంతయ్యాయి.
పరస్పర విరుద్ధ ప్రయోజనాల పొందుతూ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగారని గతంలో జి. వివేక్‌పై విమర్శలు వెల్లవెత్తాయి. దాంతో ఆయనపై అప్పుడు వేటు పడింది. వీటితో పాటు హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతి అక్రమాలపై హైకోర్టులో కేసు ఉన్నందున ఆయన నామినేషన్ చెల్లదని అధికారులు పేర్కొన్నారు. హెచ్ సీఏలో 5 పదవులకు మొత్తం 72 నామినేషన్లు రాగా, 9 మంది వివిధ కారణాలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. కాగా ఈనెల 27వ తేదీన హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి.