కేంద్ర ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీశ్‌రావుకు చోటు
ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది. ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది.
ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది. ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బిహార్ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఈ కమిటీ ఏర్పాటైంది. గతంలో కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్‌టీ ఇతర భాగస్వాములకు కమిటీలో స్థానం కల్పించేవారు. తాజాగా కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర జీఎస్టీటీ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది.