గోఎయిర్ ప్రయాణీకులకు బంపర్ ఆఫర్..
ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీ గోఎయిర్ ప్రయాణీకుల కోసం కొత్త విమాన సేవలను ప్రారంభించింది. విమానయాన సంస్థ గోమోర్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో ప్రయాణీకులు అదనపు భద్రత కల్పించడానికి అదే పిఎన్‌ఆర్‌లో మరో ప్రక్కనే ఉన్న సీటును బుక్ చేసుకునే అవకాశమిస్తోంది. అదనంగా క్యారియర్ ఆన్-డిమాండ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ అయిన ఎంఫైన్‌తో కలిసి ‘ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్’ ను కూడా ప్రారంభించింది.
ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీ గోఎయిర్ ప్రయాణీకుల కోసం కొత్త విమాన సేవలను ప్రారంభించింది. విమానయాన సంస్థ గోమోర్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో ప్రయాణీకులు అదనపు భద్రత కల్పించడానికి అదే పిఎన్‌ఆర్‌లో మరో ప్రక్కనే ఉన్న సీటును బుక్ చేసుకునే అవకాశమిస్తోంది. అదనంగా క్యారియర్ ఆన్-డిమాండ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ అయిన ఎంఫైన్‌తో కలిసి ‘ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్’ ను కూడా ప్రారంభించింది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో విధించిన ప్రయాణ పరిమితుల కారణంగా విమానయాన రంగం గణనీయంగా కుదేలైంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో భారతదేశంలోని అన్ని ప్రయాణీకుల విమానాలు నిలిచిపోయాయి. దీంతో ఆర్థికంగా చితికిపోయిన విమాన సర్వీసులు ప్రయాణికులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే గోఎయింర్ ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్‌ను అందించాలని నిర్ణయించింది. గోఎయిర్ ప్రవేశపెట్టిన గోమోర్ సౌకర్యం వినియోగించుకోవాలనుకునే ప్రయాణికలు తమ టిక్కెట్లను ఎయిర్లైన్స్ వెబ్‌సైట్ (www.goair.in), మొబైల్ యాప్ ద్వారాగానీ, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది. ప్రక్కనే ఉన్న సీటు తోపాటు అదనంగా తీసుకువెళ్లే లాగేజీకి చార్జీలు ఉండవని తెలిపింది. అలాగే భోజనంతో పాటు ఇతర సేవలు అందుబాటులో ఉంటాయని గోఎయిర్ సంస్థ తెలిపింది.
ఇక అలాగే, గోఎయిర్ ప్రయాణికులకు ఆన్-డిమాండ్ డాక్టర్ కన్సల్టేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం 500 పైగా హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లోని 3,000 మంది ఎంఫైన్ కు చెందిన వైద్యులచేత ప్రయాణీకులకు తక్షణ ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది. కేవలం 99 రూపాయల కన్సల్టేషన్ ఫీజు చెల్లించి కాల్ చేయడం ద్వారా ఆన్‌లైన్ లో వైద్యుల సలహాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గోఎయిర్ సంస్థ తెలిపింది. ఇక, గో ఎయిర్ ప్రయాణీకులకు 599 రూపాయలకు పూర్తి బాడీ చెక్అప్, 1,499 రూపాయలు చెల్లించి 50 పైగా పరీక్షలు, 550 రూపాయలు చెల్లించి అధునాతన పరికరాలతో పూర్తి బాడీ చెకప్ చేయించుకోవచ్చని తెలిపింది. రూ. 999 చెల్లించడం ద్వారా పరీక్షలతో పాటు ఉత్తమమైన ఎంఫైన్ హాస్పిటల్స్ వైద్యులతో ప్రీ కన్సల్టేషన్ ఇప్పిస్తామని వెల్లడించారు.
ప్రయాణికులకు సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణాన్ని అందించడం మా ప్రయత్నమని గో ఎయిర్ తెలిపింది. మా కస్టమర్లతో పాటు ఉద్యోగుల భద్రత మొత్తంగా గో ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, తొలిసారిగా విమానయాన చరిత్రలో ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్‌ను పరిచయం చేస్తున్నామని గోఎయిర్ సంస్థ తెలిపింది.
At GoAir it is our endeavor to provide a safe and confident journey. Introducing GoMore facility wherein you can book another adjacent seat on the same PNR in order to provide additional safety. Same can be availed via our website, app and travel agents. https://t.co/LNs8MoAOuJ
— GoAir (@goairlinesindia) July 22, 2020