AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్-19 వ్యాక్సిన్ పై ఒడిశా సీఎం అసక్తికర వ్యాఖ్యలు

కొవిడ్-19 వ్యాక్సిన్ పురోగతిపై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అడార్ పూనావాలాతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. టీకా అభివృద్ధికి పూనవాలా చేస్తున్న కృషీని సిఎం ప్రశంసించారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఒడిశాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

కొవిడ్-19 వ్యాక్సిన్ పై ఒడిశా సీఎం అసక్తికర వ్యాఖ్యలు
Balaraju Goud
|

Updated on: Jul 22, 2020 | 8:10 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి వ్యాక్సిన్ త‌యారీ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతున్న‌ద‌ని ప్రపంచంలోనే అతిపెద్ద టీకా త‌యారీ సంస్థ అయిన సీర్‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. వ‌చ్చే మూడు నెలల్లో కొన్ని ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని తాము ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నామ‌ని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో పూనావాలా చెప్పారు.

కొవిడ్-19 వ్యాక్సిన్ పురోగతిపై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అడార్ పూనావాలాతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. టీకా అభివృద్ధికి పూనవాలా చేస్తున్న కృషీని సిఎం ప్రశంసించారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఒడిశాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 1 వ దశ ట్రయల్‌లో టీకా మంచి ఫలితాలను చూపించిందని, భారతదేశంలో ఆగస్టు మధ్యలో రెండో దశ ట్రయల్స్ ప్రారంభిస్తామని పూనావాలా వివరించారు. అక్టోబర్-నవంబర్ నాటి కల్లా వ్యాక్సిన్ నూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. అన్ని ట్ర‌య‌ల్స్ పూర్తిచేసుకుని లైసెన్స్ పొందిన త‌ర్వాత ఆ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి ప్రారంభ‌మ‌వుతుంద‌ని వివరించారు. అయితే, అవసరమైన అనుమతులు పొందిన తర్వాత కొవిడ్-19 టీకాలకు ఒడిశా రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యతగా చూడాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవోను కోరారు.

కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనా సంస్థలతో పూనవాలా జతకట్టడంపై నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐఐతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. కరోనా పరీక్ష ఫలితాలను ట్రాక్ చేయడానికి ఇన్స్టిట్యూట్ను సంప్రదించినందుకు పూనవల్లా ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఇక, వ్యాక్సిన్ తయారీలో భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పనిచేస్తోంది. బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికాతో క‌లిసి క‌రోనా వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్నట్లు పూనావాలా తెలిపారు. అందుకు సంబంధించి సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్ప‌టికే డీసీజీఐ అనుమ‌తి కూడా పొందింద‌ని చెప్పారు. అక్టోబర్ నాటికల్లా నెలకు ఏడు కోట్ల మోతాదుల వ్యాక్సిన్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది డిసెంబర్ నాటికి నెలకు 10 కోట్ల మోతాదు వరకు తీసుకోవాలని యోచిస్తోంది.

Follow Us
పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌!
పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌!
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే