స్కూల్ ఆన్ వీల్స్… పయనించే పాఠశాలలో విద్యాబుద్దులు

భారతదేశంలో చాలా మంది పిల్లలు పలు కారణాల వల్ల చదువుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించపోవడం వల్ల.. చాలామంది పిల్లలు చిన్నప్పటినుంచే చదువు పక్కన పెట్టి పనులు చేసుకుంటున్నారు. దీన్ని గ్రహించిన ఒక మహిళ పిల్లలకు చదువు అందించాలి అనుకుంది. వాళ్లు స్కూల్‌కు వెళ్లకుండా చదువుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లి చదువు చెప్పేలా.. స్కూల్ ఆన్ వీల్స్ అంటూ ఒక బస్సుల్లో స్కూల్‌ను ప్రారంభించింది. 1998లో ఒక బస్సుతో పాఠశాలను ప్రారంభించగా.. ప్రస్తుతం […]

స్కూల్ ఆన్ వీల్స్... పయనించే పాఠశాలలో విద్యాబుద్దులు
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 6:41 PM

భారతదేశంలో చాలా మంది పిల్లలు పలు కారణాల వల్ల చదువుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించపోవడం వల్ల.. చాలామంది పిల్లలు చిన్నప్పటినుంచే చదువు పక్కన పెట్టి పనులు చేసుకుంటున్నారు. దీన్ని గ్రహించిన ఒక మహిళ పిల్లలకు చదువు అందించాలి అనుకుంది. వాళ్లు స్కూల్‌కు వెళ్లకుండా చదువుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లి చదువు చెప్పేలా.. స్కూల్ ఆన్ వీల్స్ అంటూ ఒక బస్సుల్లో స్కూల్‌ను ప్రారంభించింది.

1998లో ఒక బస్సుతో పాఠశాలను ప్రారంభించగా.. ప్రస్తుతం 10 బస్సుల్లో పిల్లలకు చదువు చెబుతున్నారు. విద్య అనేది ప్రాథమిక మానవ హక్కు. అంతేకాదు ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడే మంచి ప్రయోజనాలు పొందుతారని ఆమె చెబుతోంది. ముందుగా పిల్లలకు ప్రాథమిక మానవ విలువలు, క్షమశిక్షణను బోధిస్తారు. తరువాత గణితం, భాష, చదవడం, రాయడం నేర్పిస్తారు. ఎదుటి వారు ఆనందంగా ఉన్నప్పుడే మనం సంతోషం అని ఆమె చెబుతోంది.