Hair Loss in Women: 40 ఏళ్ల తర్వాత మీకూ జుట్టు రాలుతుందా? రోజూ ఈ చిన్న పని చేస్తే చాలు..
వయసు పెరిగేకొద్దీ పురుషులు, మహిళలకు జుట్టు రాలడం సర్వసాధారణం. ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత మహిళలకు జుట్టు వేగంగా రాలడం పెరుగుతుంది. చాలా మంది ఈ సమస్యను నియంత్రించడం అసాధ్యంగా భావించి జుట్టు కోల్పోతుంటారు. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఎదురైందా? 40 సంవత్సరాల తర్వాత ఎందుకు..

వయసు పెరిగేకొద్దీ పురుషులు, మహిళలకు జుట్టు రాలడం సర్వసాధారణం. ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత మహిళలకు జుట్టు వేగంగా రాలడం పెరుగుతుంది. చాలా మంది ఈ సమస్యను నియంత్రించడం అసాధ్యంగా భావించి జుట్టు కోల్పోతుంటారు. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఎదురైందా? 40 సంవత్సరాల తర్వాత ఎందుకు జుట్టు రాలుతుంది? అనే విషయాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
మాక్స్ హాస్పిటల్‌లోని డెర్మటాలజీ విభాగంకి చెందిన డాక్టర్ సౌమ్య సచ్‌దేవా దీని గురించి మాట్లాడుతూ.. 40 ఏళ్ల తర్వాత జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది మహిళలు ఈ వయసులో మెనోపాజ్‌కు గురవుతారు. ఇది కూడా ఒక కారణం. అంతేకాకుండా అనేక హార్మోన్ల లోపాలు కూడా దీనికి కారణం కావచ్చు. మహిళలకు ఐరన్, విటమిన్ డి, బయోటిన్ లోపం ఉన్నా జుట్టు రాలడం సంభవించవచ్చు.
మానసిక ఒత్తిడి
మహిళల్లో జుట్టు రాలడానికి మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణమని డాక్టర్ సౌమ్య అంటున్నారు. ఇటీవలి సంవత్సరాలలో మానసిక ఒత్తిడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇవి జుట్టును కూడా ప్రభావితం చేస్తాయి. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. జుట్టు రాలడానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో, ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. ఈ వ్యాధులకు చికిత్స లేదు. కొంతమంది మహిళల్లో థైరాయిడ్ లేదా డయాబెటిస్ వల్ల కూడా జుట్టు రాలడం సంభవించవచ్చు. ఇలాంటి సందర్భాలలో థైరాయిడ్, డయాబెటిస్‌ను నియంత్రించడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు.
జుట్టు రాలడాన్ని నివారించవచ్చా?
మహిళకు ఆటో ఇమ్యూన్ వ్యాధి లేదా జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు రాలడం జరిగితే దానిని పూర్తిగా నియంత్రించడం కష్టం. ఇతర సందర్భాల్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. అవేంటంటే..
- ప్రోటీన్, ఐరన్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- జుట్టు పెరుగుదలకు పుట్టగొడుగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
- నీళ్లు పుష్కలంగా తాగాలి.
- మానసిక ఒత్తిడిని నివారించాలి. దానిని నివారించడానికి ప్రతిరోజూ యోగా సాధన చేయాలి.
- మీ తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




