AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలిని చంపి..రెండేళ్ల తర్వాత అరెస్టయ్యాడు

గుంటూరు జిల్లా అలీనగర్​లో రెండున్నరేళ్ల కిందట అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని నజీమా కేసును పోలీసులు ఛేదించారు.

ప్రియురాలిని చంపి..రెండేళ్ల తర్వాత అరెస్టయ్యాడు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 10, 2020 | 6:40 PM

Share

గుంటూరు జిల్లా అలీనగర్​లో రెండున్నరేళ్ల కిందట అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని నజీమా కేసును పోలీసులు ఛేదించారు.  ప్రియుడు షేక్ కరీం అలియాస్ నాగూర్ ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పెళ్లి చేసుకోమని కోరడంతోనే నజీమాను అతడు హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….గుంటూరు జిల్లాకు చెందిన షేక్ కరీం, నజీమా ప్రేమించుకున్నారు. అయితే నజీమా పెళ్లి ప్రస్తావన తీసుకురావంటంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని అతడు భావించాడు. పక్కా ప్లాన్ ప్రకారం వారిద్దరూ కలుసుకునే గదికి ఆమెను రప్పించి ఏకాంతంగా గడిపారు. ఆమె మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో ..ఆమె తలను గోడకేసి బాదాడు. తలకు గాయమై సృహ తప్పి పడిపోయిన ఆమెను గొంతునులిమి చంపేశాడు. అనంతరం ముందుగా తెచ్చి పెట్టుకున్న కట్టర్​తో శరీరాన్ని పార్టులు, పార్టులుగా కట్​చేసి ప్లాస్టిక్ కవర్​లో మూటగట్టి జనసంచారం లేని ప్రదేశంలో పడేశాడు. రెండురోజుల తర్వాత మళ్లీ వెళ్లి పెట్రోల్ పోసి శరీరాన్ని తగులబెట్టాడు. అనుమానిత డెడ్‌బాడీ దొరికిందన్న సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శరీర అవయవాలను డీఎన్​ఏ టెస్టుకు పంపగా…డెడ్‌బాడీ అదృశ్యమైన నజీమాదిగా గుర్తించారు. ఈ కేసులో ముద్దాయిని రెండేళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు.

Also Read : 

దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్