బీహార్ ఎన్నికలు, సాయంత్రానికి బీజేపీకి సీన్ రివర్స్ ! ఎలాగంటే ?
బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చినట్టు కనిపిస్తోంది. మంగళవారం ఉదయమంతా ఈ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిందని వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రం ఆరు గంటల సమయానికి సీన్ మారిపోయింది. ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాను బీజేపీ నుంచి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కైవసం చేసుకుంది. ఈ సమయానికి ఈ పార్టీ 73 స్థానాల్లో లీడ్ లో ఉండగా బీజేపీ 68 సీట్లలో లీడ్ లో ఉంది. […]
బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చినట్టు కనిపిస్తోంది. మంగళవారం ఉదయమంతా ఈ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిందని వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రం ఆరు గంటల సమయానికి సీన్ మారిపోయింది. ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాను బీజేపీ నుంచి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కైవసం చేసుకుంది. ఈ సమయానికి ఈ పార్టీ 73 స్థానాల్లో లీడ్ లో ఉండగా బీజేపీ 68 సీట్లలో లీడ్ లో ఉంది. అంతేకాదు ! ఈ రాష్ట్రంలో 9 సీట్ల ఫలితాలకు గాను బీజేపీ మూడు సీట్లలో విజయం సాధించగా.. ఆర్జేడీ, జేడీ-యూ రెండేసి చొప్పున, కాంగ్రెస్, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక ఈ రాష్ట్రంలో ఎం ఐ ఎం కూడా ఆరు చోట్ల లీడ్ లో ఉంది.
గుజరాత్ బైపోల్స్ లో మొదట ఊహించినట్టుగానే 8 సీట్లనూ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇక కర్ణాటకలో రెండు చోట్లా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఔరంగాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.