AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ విజయంపై పవన్ కల్యాణ్ స్పెషల్ కామెంట్

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. విజయం సాధించిన రఘునందన్ రావును, టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌లను అభినందిస్తూనే...

బీజేపీ విజయంపై పవన్ కల్యాణ్ స్పెషల్ కామెంట్
Rajesh Sharma
|

Updated on: Nov 10, 2020 | 6:37 PM

Share

Pawankalyan comment on BJP victory: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ దుబ్బాకలో బీజేపీ సాధించిన విజయం తనదైన శైలిలో స్పందించారు. గెలిచిన రఘునందన్ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్.. ఈ విజయం దుబ్బాక యువకులదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

‘‘ దుబ్బాకలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు, బి.జె.పి. తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి శుభాబినందనలు తెలుపుతున్నాను. బి.జె.పి., ఆ పార్టీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం దుబ్బాకలో ఈ విజయంగా భావిస్తున్నాను.. ముఖ్యంగా బి.జె.పి. తెలంగాణ శాఖ నాయకత్వ పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి నేటి దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ నేటి విజయానికి మార్గం వేసింది.. పార్టీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేసి ఆయన ఈ విజయాన్ని సాధించారు.. అదే విధంగా రఘునందన్ రావు గారి వ్యక్తిత్వం, ప్రజా సేవలో చూపే నిబద్దత ఆయనకు విజయ హారాన్ని అందించింది.. రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యమవుతుందని నేను విశ్వసిస్తాను.. ఈ ఎన్నికలో యువకులు విశేష సంఖ్యలో పాల్గొనడం ఒక శుభపరిణామం.. యువతలోని చైతన్యమే ఈ ఎన్నికలో విజయం సాధించిందని నేను భావిస్తున్నాను.. దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను..’’ అంటూ ప్రకటన విడుదల చేశారు జనసేనాని.

ALSO READ: రిజల్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఈసీ

ALSO READ: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో కొత్త ట్విస్టు

ALSO READ: ఎల్లుండి ఏపీలో ఉరుములతో పిడుగులు

ALSO READ: గ్రేటర్ ఎన్నికల దిశగా ఈసీ కీలక ఆదేశాలు

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..