సముద్ర తీరంలో అలజడి.. కచ్‌లో భూకంపం.. పరగులు తీసిన జనం..!

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో బుధవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) తెలిపింది. భయాందోళనలకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.

సముద్ర తీరంలో అలజడి.. కచ్‌లో భూకంపం.. పరగులు తీసిన జనం..!
Earthquake
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 01, 2025 | 11:35 AM

గుజరాత్‌లోని కచ్‌లో బుధవారం(జనవరి 1) ఉదయం భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 10.24 గంటలకు భూకంపం సంభవించిందని, దీని కేంద్రం భచౌకి 23 కిలోమీటర్ల ఉత్తర-ఈశాన్య (NNE) దూరంలో కేంద్రీకృతమైంది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో బుధవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) తెలిపింది. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని జిల్లా అధికారులు తెలిపారు.

గత డిసెంబర్ నెలలో, ఈ ప్రాంతంలో 3 తీవ్రత కంటే ఎక్కువ నాలుగు భూకంప కార్యకలాపాలు నమోదయ్యాయి. ఇందులో మూడు రోజుల క్రితం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా భచౌ సమీపంలో ఉంది. ISR ప్రకారం, డిసెంబర్ 23 న 3.7 తీవ్రతతో భూకంపం జిల్లాను తాకింది. డిసెంబర్ 7వ తేదీన 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. గతేడాది నవంబర్ 18న కచ్‌లో 4 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా, ఈ భూకంపానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..