New Act in Gujarat: కీలక చట్టం తీసుకువచ్చిన గుజరాత్.. ఇకపై భూకబ్జాలకు పాల్పడిన వారికి చుక్కలే..
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి పెట్రోగిపోతున్న భూకబ్జాదారుల భరతం పట్టేందుకు ముందడుగు వేసింది. ఇందులో భాగంగా కీలక చట్టాన్ని తీసుకువచ్చింది.
New Act in Gujarat: గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి పెట్రేగిపోతున్న భూకబ్జాదారుల భరతం పట్టేందుకు ముందడుగు వేసింది. ఇందులో భాగంగా కీలక చట్టాన్ని తీసుకువచ్చింది. యాంటీ-సోషల్ యాక్టివిటీస్ పేరుతో తీసుకువచ్చిన బిల్లును బుధవారం నాడు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రజలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే ఎవరైనా భూకబ్జాకు పాల్పడినట్లు రుజువైతే వారికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లు ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టానికి గుజరాత్ గవర్నర్ ఆమోదం తెలుపగా.. బుధవారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు. భూ ఆక్రమణ కేసుల విచారణకు ప్రతీ జిల్లాలో ప్రత్యేక కమిటీలు, కోర్టులు కూడా నియమిస్తున్నామని ఆయన చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ చట్టం.. రైతులు, సామాన్య ప్రజలకు రక్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read:
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్.. రాహుల్ హాస్యాస్పదంగా వ్యవహరించారన్న హర్దీప్ సింగ్ పూరి