జియో స్పీడ్… 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో టాప్‌… టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా …

జియో మరోసారి 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్‌ నెలకు సంబంధించిన గణాంకాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా వెల్లడించింది.

జియో స్పీడ్... 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో టాప్‌... టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 17, 2020 | 6:51 AM

జియో మరోసారి 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్‌ నెలకు సంబంధించిన గణాంకాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా వెల్లడించింది. దాని ప్రకారం.. జియో 20.8 ఎంబీపీఎస్ డేటా డౌన్‌లోడ్ రేటుతో మొదటి స్థానంలో నిలిచింది. వొడాఫోన్‌ డౌన్‌లోడ్‌ వేగం కంటే జియో రెట్టింపు వేగాన్ని నమోదు చేసింది.

ఇక అప్‌లోడ్‌ విషయంలో వొడాఫోన్‌ 6.5 ఎంబీపీఎస్‌ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబరు 10న ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నవంబర్‌లో వొడాఫోన్ 9.8 ఎంబీపీఎస్‌ సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఐడియా 8.8, భారతీ ఎయిర్‌టెల్ 8 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేశాయి. అప్‌లోడ్‌ విభాగంలో వొడాఫోన్‌ తర్వాత.. ఐడియా 5.8‌,ఎయిర్‌టెల్ 4, జియో 3.7 ఎంబీపీఎస్‌ వేగంతో వరుస స్థానాల్లో నిలిచాయి. వొడాఫోన్, ఐడియా సెల్యులర్‌లు విలీనమై వొడాఫోన్ ఐడియాగా పనిచేస్తున్నప్పటికీ.. ట్రాయ్ మాత్రం వారి నెట్‌వర్క్ పనితీరును విడి విడిగానే లెక్కిస్తోంది.